News December 16, 2025
NTR: న్యూ ఇయర్ కానుకగా ‘ఆంధ్ర టాక్సీ యాప్’

ఆటో, టాక్సీ డ్రైవర్ల కోసం కమిషన్ లేకుండా ‘ఆంధ్ర టాక్సీ’ యాప్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నారు. ఓలా, రాపిడోలో 30% వరకు కమిషన్ తీసుకుంటున్న నేపథ్యంలో ఇది ఉపశమనం కలిగించనుంది. ఈ యాప్‌ను మొదట ఎన్టీఆర్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద జనవరి 1న ప్రారంభించనున్నారు. దీనిని పర్యాటక ప్రాంతాలకు అనుసంధానించి ప్రత్యేక ప్యాకేజీలు అందించనున్నారు. రేపటి నుంచి డ్రైవర్లకు అవగాహన కల్పిస్తారు.
Similar News
News December 20, 2025
PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే ఇందులో A, B, C, D అని 4 రకాలున్నాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.
News December 20, 2025
ఈ కలుపు మందులతో వయ్యారిభామ నిర్మూలన

వయ్యారిభామ నిర్మూలనకు పంట మొలకెత్తక ముందు అట్రాజిన్ రసాయన మందును లీటర్ నీటికి నాలుగు గ్రాములు కలిపి పిచికారీ చేయాలి. పంట మొలకెత్తిన 15 నుంచి 20 రోజులకు.. లీటరు నీటికి 2 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్ కలిపి పిచికారీ చేయాలి. బంజరు భూముల్లో లీటరు నీటికి 5 గ్రాముల అట్రాజిన్ మందు కలిపి పిచికారీ చేసి వయ్యారిభామను నివారించవచ్చు. కలుపు నివారణ మందులను పిచికారీ చేసేటప్పుడు పక్క పంటలపై పడకుండా జాగ్రత్తపడాలి.
News December 20, 2025
గోదావరి పుష్కరాలకు రూ.3వేల కోట్లు?

AP: 2027 జూన్‌లో జరిగే గోదావరి పుష్కరాల కోసం ప్రభుత్వం ఇప్పటి నుంచే సన్నాహాలు చేస్తోంది. ఏలూరు, కాకినాడ, తూ.గో, ప.గో, అంబేడ్కర్ కోనసీమ జిల్లాల్లో 500+ ఘాట్లు సిద్ధం చేయాలని భావిస్తోంది. ఈసారి పుష్కరాల నిర్వహణ ఖర్చు ₹3,000Cr అవుతుందని అంచనా. ఇందులో కేంద్రం నుంచి మెజారిటీ వాటా తెప్పించుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. 2015లో 4.50Cr మంది పుష్కర స్నానాలు ఆచరించారు. ఈసారి ఈ సంఖ్య 10Cr+ ఉంటుందని అంచనా.


