News March 11, 2025
NTR : పరిష్కార వేదికలో 135 ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించామని ఏబీటీఎస్.ఉదయారాణి తెలిపారు. ఫిర్యాదుల్లో నగదు లావాదేవీలకు 30, భార్యాభర్తలు, కుటుంబ కలహాలకు 25, మహిళా సంబంధిత నేరాలకు 18, భూవివాదాలకు 22, వివిధ మోసాలకు 13, దొంగతనాలకు 03, కొట్లాటకు 06, ఇతర చిన్న చిన్న వివాదాలు సమస్యలకు, ఘటనలకు 18, మొత్తం 135 ఫిర్యాదులను స్వీకరించామన్నారు.
Similar News
News November 14, 2025
MBNR: నెట్‌బాల్ ఎంపికలకు 200 మంది

MBNR స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాకు చెందిన అండర్-14, 17, 19 బాల బాలికలకు నెట్‌బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్స్‌కు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15 నుంచి 17 వరకు మహబూబాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి నెట్‌బాల్ టోర్నీలో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి డా.ఆర్.శారదాబాయి తెలిపారు.
News November 14, 2025
షార్‌లో 141 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. నేడే లాస్ట్ డేట్

సూళ్లూరుపేటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (SHAR) నందు సైంటిస్ట్/ ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్ – బి ఉద్యోగాల దరఖాస్తులకు శుక్రవారంతో గడువు ముగియనుంది. వివిధ విభాగాలలో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి. అర్హత, ఇతర వివరాలకు https://apps.shar.gov.in/sdscshar/result1.jsp వెబ్ సైట్ చూడగలరు. ఆన్ లైన్ దరఖాస్తులకు చివరి తేదీ నవంబర్ 14.
News November 14, 2025
ఆగిరిపల్లిలో అర్ధరాత్రి యాక్సిడెంట్.. ఇద్దరి మృతి

ఆగిరిపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బైకును పాల వ్యాను ఢీకొన్న ఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులలో ఒకరు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. గాయాలైన మరో వ్యక్తిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయారు. ఎస్ఐ శుభ శేఖర్ సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వ్యాన్ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు.


