News September 10, 2025
NTR: పీజీ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో జనవరి 2025లో నిర్వహించిన ఎం.కామ్ 1, 3వ, ఎం.ఏ. రాజనీతి శాస్త్రం, చరిత్ర, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 1వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News September 10, 2025
HNK జిల్లాలో నేటి క్రైమ్ న్యూస్

✓ ఉమ్మడి జిల్లాలో JAN-AUG వరకు 1,142 మంది ఆత్మహత్య
✓ చింతలపల్లిలో రైలు కింద పడి యువకుడి ఆత్మహత్య
✓ హనుమకొండలో 50, కాజీపేటలో 49 ట్రాఫిక్ ఉల్లంఘన కేసులు
✓ అక్రమ ఇసుక రవాణాపై పోలీసుల ఉక్కుపాదం
✓ HNK: ప్రభుత్వ పథకాల పేరుతో వచ్చే లింకులపై క్లిక్ చేయొద్దు!
✓ ముల్కనూరు: అక్రమ ఇసుక రవాణా ట్రాక్టర్ పట్టివేత
✓ బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన కేయూ పోలీసులు
News September 10, 2025
సూర్యాపేట అదనపు కలెక్టర్‌గా సీతారామరావు

సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ)గా కె.సీతారామరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నల్గొండ జిల్లాలో స్పెషల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన, ఇటీవలే పదవీ విరమణ చేసిన అదనపు కలెక్టర్ రాంబాబు స్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు.
News September 10, 2025
ఓర్వకల్లు రాక్ గార్డెన్ సందర్శించిన మంత్రి

ఓర్వకల్లులో సహజ సిద్ధంగా ఏర్పడ్డ రాక్ గార్డెన్ అద్భుత ప్రకృతి సౌందర్యానికి నిలయంగా నిలుస్తోందని మంత్రి కందుల దుర్గేశ్ అన్నారు. రాక్ గార్డెన్‌ను బుధవారం ఆకస్మికంగా సందర్శించి హరిత రిసార్ట్స్, రెస్టారెంట్‌ను పరిశీలించారు. అక్కడి అధికారులు, సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. సహజ సిద్ధమైన కొండల మధ్య ఉన్న రాతివనం, చెరువు, ఏళ్ల క్రితం ఏర్పడ్డ వివిధ ఆకృత రాళ్లు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయన్నారు.