News September 11, 2025
NTR: పోలీసుల కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్

పోలీసుల, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ కోసం ‘హెల్త్ ఫస్ట్ 1991’ యాప్‌ను విజయవాడ సీపీ రాజశేఖరబాబు గురువారం ప్రారంభించారు. 1991 బ్యాచ్ పోలీసులు, వైద్యుల సహకారంతో ఈ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా ఉచిత కన్సల్టెన్సీ, చికిత్సపై 20-30% రాయితీలు లభిస్తాయని సీపీ తెలిపారు. ఇప్పటి వరకు 14,000 మందికి పైగా రిజిస్టర్ చేసుకున్నారు.
Similar News
News September 12, 2025
సెప్టెంబర్ 12: చరిత్రలో ఈ రోజు

1925: ఆకాశవాణి మొట్టమొదటి మహిళా న్యూస్ రీడర్ జోలెపాళ్యం మంగమ్మ జననం (ఫొటోలో లెఫ్ట్)
1967: నటి అమల అక్కినేని జననం
2009: హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ మరణం (ఫొటోలో రైట్)
2009: BCCI మాజీ అధ్యక్షుడు రాజ్‌సింగ్ దుంగార్పూర్ మరణం
2010: సింగర్ స్వర్ణలత మరణం
2024: తెలుగు గీత రచయిత గురుచరణ్ మరణం
News September 12, 2025
సంగారెడ్డి: దరఖాస్తుల ఆహ్వానం

2025-26 సంవత్సరానికి విద్యార్థి విజ్ఞాన్ మంథన్ దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. 6 నుంచి 11వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులని చెప్పారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకున్నందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 12, 2025
డిగ్రీలో ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు

TG: డిగ్రీ కాలేజీల్లో మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఈ నెల 12న ఖాళీ సీట్ల వివరాలను నోటీసు బోర్డుల్లో, <