News April 16, 2025

NTR: బీ-ఫార్మసీ 8వ సెమిస్టర్ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

కృష్ణా యూనివర్శిటీ(KRU) పరిధిలోని కళాశాలల్లో బీ-ఫార్మసీ కోర్సులు చదివే విద్యార్థులు రాయాల్సిన 8వ సెమిస్టర్ థియరీ పరీక్షల టైం టేబుల్ విడుదలైంది. ఏప్రిల్ 21 నుంచి 28 మధ్య నిర్ణీత తేదీలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు యూనివర్శిటీ పరిధిలోని 3 కాలేజీలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని అధ్యాపకులు తెలిపారు. సబ్జెక్టువారీగా టైం టేబుల్ వివరాలకు https://kru.ac.in/ వెబ్‌సైట్ చూడాలని కోరారు.

Similar News

News February 22, 2026

మండల స్థాయిలోనూ PGRS: కలెక్టర్

image

చిత్తూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 గంటల నుంచి మ. 2 గంటల వరకు ప్రజల నుంచి అర్జీలు తీసుకుంటామన్నారు. Meekosam.ap.gov.inలోనూ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. డయల్ 1100లో ఫిర్యాదు స్థితిని తెలుసుకోవచ్చు అన్నారు. ఇక నుంచి డివిజన్, మండల స్థాయిలోనూ PGRS నిర్వహిస్తామన్నారు.

News February 22, 2026

డాక్ సేవకుల వల్లే సూపర్-6 హిట్ అయింది: సీఎం చంద్రబాబు

image

AP: డాక్ సేవకులతోనే సూపర్ సిక్స్ హిట్ అయిందని.. 33% డీబీటీలు వీరి వల్ల పూర్తయ్యాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏఐ, మెషీన్లు ఉన్నా హ్యూమన్ టచ్ డాక్ సేవకులు మాత్రమే ఇవ్వగలరన్నారు. గుంటూరులో డాక్ సేవక్ సమ్మేళన్‌కు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డాక్ సేవకులకు ఓ ఎలక్ట్రిక్ సైకిల్ ఇవ్వాలని సీఎం కేంద్రమంత్రిని ఈ సందర్భంగా కోరారు.

News February 22, 2026

25న బడి బస్సుల భద్రతపై కీలక భేటీ: DTO

image

ఈనెల 25న మధ్యాహ్నం 3 గంటలకు కలెక్టరేట్‌లోని గోదావరి భవన్‌లో బడి బస్సుల భద్రతపై నిర్వహించే సమావేశానికి స్కూల్, కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రులు హాజరుకావాలని జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు కోరారు. డ్రైవర్ల నిర్లక్ష్యంతో జరుగుతున్న ప్రమాదాలను అరికట్టేందుకు పోలీస్, రవాణా, విద్యాశాఖలు సంయుక్తంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.