News April 7, 2025

NTR: బెట్టింగ్ వివాదం.. యువకుడిపై దాడి

image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో బెట్టింగ్ విషయమై ఇద్దరు యువకుల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. IPL మ్యాచ్ విషయమై ఇద్దరి మధ్య క్వార్టర్ బాటిల్ పందెం ఒప్పందం కుదిరింది. నవీన్ కుమార్ పందెం ఓడిపోవడంతో మద్యం కొనివ్వాలని కోరగా అతను నిరాకరించాడు. దీంతో మద్యం మత్తులో ఉన్న మహేశ్ ఖాళీ సీసాతో నవీన్‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన నవీన్‌ను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Similar News

News October 25, 2025

మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకండి: కలెక్టర్

image

తుఫాన్ కారణంగా ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు ఆదివారం సాయంత్రంలోగా తిరిగి ఇంటికి చేరుకునేలా చర్యలు తీసుకోవాలని మత్స్య శాఖాధికారులను కోరారు.

News October 25, 2025

కృష్ణా: తుపాన్ హెచ్చరికలు.. 3 రోజులు స్కూల్స్ బంద్

image

‘మోంతా’ తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో ఈ నెల 27, 28, 29 తేదీల్లో జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా విద్యా సంస్థలకు శెలవు ప్రకటిస్తున్నామన్నారు. సంక్షేమ హాస్టల్స్‌లో ఉండే విద్యార్థులందరినీ 26వ తేదీ సాయంత్రం లోపు వారి వారి ఇళ్లకు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News October 25, 2025

జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు: కొల్లు రవీంద్ర

image

రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన జగన్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వంపై బురదజల్లే పనిలో పడ్డారని గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా విమర్శించారు. విజయవాడ ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలతో సమన్వయ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. గత ఐదేళ్లలో వైసీపీ నేతలు కృష్ణా జిల్లాను అరాచకాల నిలయంగా మార్చారన్నారు.