News December 16, 2025
NTR: బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను పంపిణీ చేసిన కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణను మెరుగుపర్చేలా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ఏడు బ్యాటరీ ఆపరేటెడ్ వాహనాలను కలెక్టర్ డా. జి. లక్ష్మీశ కలెక్టరేట్‌లో పంపిణీ చేశారు. ఇంటింటి నుంచి తడి-పొడి చెత్తను వేరుగా సేకరించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయని తెలిపారు. డీఆర్ఓ ఎం. లక్ష్మీనరసింహం, డీపీవో పి. లావణ్య కుమారి, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News December 17, 2025
సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మార్పు

TG: రాష్ట్రంలో నూతన సర్పంచుల బాధ్యతల స్వీకరణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన డిసెంబర్ 20న కాకుండా 22వ తేదీకి అపాయింటెడ్ డేను మారుస్తూ పంచాయతీరాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 20న సరైన ముహూర్తాలు లేవని, తేదీని మార్చాలని ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త సర్పంచులందరూ 22వ తేదీన బాధ్యతలు స్వీకరించనున్నారు.
News December 17, 2025
భద్రాద్రిలో ముగిసిన పోలింగ్: 80.64 శాతం నమోదు

జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 80.64 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మండలాల వారీగా సుజాతనగర్‌లో అత్యధికంగా 85.75%, లక్ష్మీదేవిపల్లిలో 82.28%, జూలూరుపాడులో 77.01% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపు పూర్తయిన వెంటనే విజేతలను ప్రకటిస్తారు.
News December 17, 2025
సూర్యపేట: ‘1 గంటలోపు పోలింగ్ కేంద్రానికి చేరుకున్న వారికి ఓటు అవకాశం’

ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మధ్యాహ్నం 1:00 గంటలలోపు పోలింగ్ కేంద్రం ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి టోకెన్లు జారీ చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎన్నికల సిబ్బందిని కలెక్టర్ ఆదేశించారు. మఠంపల్లి మండలం వర్ధాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాలలో పోలింగ్ సరళిని ఆయన బుధవారం పరిశీలించారు.


