News February 5, 2025
NTR: మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువు పెంపు
ఎన్టీఆర్ జిల్లా గీత కులాలకు కేటాయించిన 11 మద్యం దుకాణాలకు దరఖాస్తు గడువును ఈ నెల 5 నుంచి 8 సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. ఈ మేరకు జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి S. శ్రీనివాసరావు బుధవారం తెలిపారు. మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు ఈ నెల 7వ తేదీ కాకుండా 10 తేదీ ఉదయం 9 గంటల నుంచి గొల్లపూడిలోని BC భవన్‌లో నిర్వహించనున్నట్లు వివరించారు.
Similar News
News February 6, 2025
‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం రద్దు
AP: ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని నిలిపివేస్తూ రాష్ట్ర ప్రణాళికా విభాగం ఉత్తర్వులిచ్చింది. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని పేర్కొంది. వైసీపీ హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఉద్యోగులు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీసేవారు. అర్హత ఉండి ఏదైనా పథకం అందకపోతే అప్లై చేసేవారు. అయితే ఇది వైసీపీ కార్యక్రమంగా మారిందని అప్పట్లో టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు.
News February 6, 2025
విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలు పంపండి: కలెక్టర్
పాఠశాల విద్యావ్యవస్థ బలోపేతానికి ప్రతిపాదనలను పంపాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అధికారులను కోరారు. బుధవారం పాఠశాలల బలోపేతం- రీస్ట్రక్చరింగ్ అంశంపై కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వలసకు వెళ్లే విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని అన్నారు. పాఠశాలలు అందుబాటులో ఉండేలా ప్రతిపాదనలు ఉండాలని మండల విద్యాశాఖ అధికారులను ఆదేశించారు.
News February 6, 2025
పెద్దపల్లి: ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలి: కలెక్టర్
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగేలా చూడాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ సమీకృత కార్యాలయంలో వైద్య అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. గర్భిణీలను ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పేషెంట్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు.