News August 29, 2025
NTR: మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, సోషల్ కౌన్సిలర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు పూర్తి చేసిన దరఖాస్తులను సెప్టెంబర్ 9 లోపు విజయవాడ మారుతీనగర్‌లోని మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయాలని అధికారులు సూచించారు. దరఖాస్తు ప్రక్రియ, వేతన వివరాల కోసం https://ntr.ap.gov.in/ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు.
Similar News
News August 29, 2025
యలమంచిలి: గోదావరిలో స్నానానికి దిగి వ్యక్తి మృతి

యలమంచిలి మండలం చించినాడ పుష్కర ఘాట్‌లో స్నానానికి దిగి డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి గ్రామానికి చెందిన వేగి మోహనరావు (42) మృతి చెందినట్లు ఎస్ఐ కే.గుర్రయ్య తెలిపారు. ఈ నెల 25వ తేదీన స్నానానికి దిగిన మెహనరావు ఈత కొడుతూ ప్రమాదవశాత్తూ మునిగిపోయాడన్నారు. గురువారం దర్బరేవు వద్ద గోదావరిలో మృతదేహం లభ్యమైందని చెప్పారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News August 29, 2025
గుంటూరు వైద్య కళాశాలలో రికార్డు

గుంటూరు వైద్య కళాశాల గురువారం రికార్డు నెలకొల్పింది. ఒకేరోజు 121 మంది విద్యార్థులకు MBBS కోర్సులో ప్రవేశాలు ఇవ్వడంతో పాటు వారందరికీ నిన్న సాయంత్రం 4 గంటలకే అడ్మిషన్ కార్డులు అందజేశారు. తొలుత వచ్చిన 50 మందికి 12 గంటలకే అడ్మిషన్లు పూర్తి చేశారు. వినాయక చవితి సెలవు అయినప్పటికీ వచ్చిన ఏడుగురికి బుధవారమే అడ్మిషన్ ఇవ్వగా. ఇప్పటివరకు మొత్తం 195 మంది కళాశాలలో చేరారు. కాగా ఇంకా 16 మంది చేరాల్సి ఉంది.
News August 29, 2025
KNR: గణేశ్ నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారు..?

వినాయక నవరాత్రుల్లో నేడు 3వ రోజు. ఇవాళ్టి నుంచే గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తారు. ఉమ్మడి KNR వ్యాప్తంగా కొందరు 5, 7, 9రోజులకు నిమజ్జనం చేస్తే, మరికొందరు 11రోజులకు విఘ్నేశ్వరుడిని జలప్రవేశం చేయిస్తారు. కాగా, ఆ గణనాథుడి నిమజ్జనానికి నిర్వాహకులు ఇప్పటికే సన్నద్ధమయ్యారు. కొందరిప్పటికే మహారాష్ట్ర, HYD మర్ఫా బ్యాండ్లను బుక్ చేసుకున్నారు. మరి ఈసారి మీరు గణేశ్ నిమజ్జనం ఎప్పుడు చేస్తున్నారో COMMENT చేయండి.