News April 16, 2025
NTR: మునిసిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్

జిల్లాలో పీ-4 సర్వే ఆధారంగా గుర్తించిన ప్రతి కుటుంబానికి ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కృషిచేస్తున్నట్లు మంగళవారం కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించడంలో జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులతో కలిసి సమన్వయంతో పని చేయాలని ఆయన ఆదేశించారు. ఎంపీడీఓలు, మునిసిపల్ కమిషనర్లతో కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి మాట్లాడారు.
Similar News
News December 26, 2025
ప్రకాశం జిల్లాలో TDP మొదలెట్టింది.. జనసేన ఎప్పుడో..?

ప్రకాశం జిల్లాలో TDP జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే TDPకి బూత్, గ్రామ స్థాయి కమిటీలు ఉన్నాయి. అయితే జనసేన అదే తరహా కమిటీలను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. ఇదే విషయాన్ని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ పదవీ బాధ్యత కార్యక్రమంలో ప్రకటించారు. కాగా జిల్లా జనసేన అధ్యక్షుడు రియాజ్ సారథ్యంలో బూత్, గ్రామ కమిటీల నియామకం ఎప్పుడు జరుగుతుందన్నదే ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది.
News December 26, 2025
హిందూపురంలో హత్య..!

హిందూపురంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్ కామన్ బెడ్డింగ్ సెంటర్‌లో మోద గ్రామానికి చెందిన వ్యక్తి హత్యకు గురైనట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించిన్నట్లు స్థానికులు తెలిపారు. సెల్‌ఫోన్ విషయమై జరిగిన ఘర్షణ హత్యకు దారితీసిందని చెప్పారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News December 26, 2025
మామిడిలో బోరాన్, పొటాష్ లోపాన్ని ఎలా గుర్తించాలి?

మామిడిలో బోరాన్ లోపం వల్ల చెట్ల ఆకులు కురచగా మారి ఆకుకొనలు నొక్కుకుపోయి పెళుసుగా మారతాయి. కాయలపై పగుళ్లు ఏర్పడతాయి. దీని నివారణకు ప్రతి మొక్కకు 100గ్రా. బోరాక్స్ భూమిలో వేయాలి లేదా లీటరు నీటికి 1ml-2ml బోరాక్స్ లేదా బోరికామ్లం కొత్త చిగురు వచ్చినప్పుడు 1-2 సార్లు పిచికారీ చేయాలి. ఆకుల అంచులు ఎండిపోతే పొటాష్ లోపంగా గుర్తించాలి. దీని నివారణకు లీటరు నీటికి 13:0:45 10గ్రా. కలిపి పిచికారీ చేయాలి.


