News February 2, 2025
NTR: యూజీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో అక్టోబర్, నవంబర్ 2024లో నిర్వహించిన యూజీ 3వ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు రీ వాల్యుయేషన్/ పర్సనల్ వెరిఫికేషన్ కోరుకునే విద్యార్థులు ఫిబ్రవరి 13లోగా ఒక్కో పేపరుకు నిర్ణీత ఫీజు రూ.1,490 చెల్లించాల్సి ఉంటుందని వర్శిటీ పరీక్షల విభాగ కంట్రోలర్ శనివారం తెలిపారు.
Similar News
News January 10, 2026
కరీంనగర్‌లో బహిరంగ సభకు స్థలమే కరువైందా..?

కరీంనగర్‌లో అత్యంత రద్దీగా ఉండే కోర్టుచౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ సభ ఏర్పాటుచేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. PCC SC అధ్యక్షుడిగా కవ్వంపల్లి సత్యనారాయణ నియామకం తర్వాత తొలిసారి రాకను పురస్కరించుకుని ప్రధానరోడ్డుపైనే వేదిక నిర్మించారు. వేలసంఖ్యలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైన పర్మిషన్ ఇచ్చేముందు అధికారులు ఆలోచించాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
News January 10, 2026
కొవ్వూరు జనసేన ఇన్‌ఛార్జ్‌గా టీవీ రామారావు పునర్నియామకం

కొవ్వూరు జనసేన పార్టీ ఇన్‌ఛార్జ్‌గా టీవీ రామారావును పునర్నియమిస్తూ శనివారం పార్టీ ప్రకటన విడుదల చేసింది. గతంలో పార్టీ లైన్ అతిక్రమించడంతో ఆయనను పార్టీ కార్యకలాపాలకు దూరంగా పెట్టింది. దీనిపై జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ సమర్పించిన నివేదికను పరిశీలించిన అనంతరం పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రామారావు అనుచరులు, జనసైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News January 10, 2026
రైల్వే పిట్ లైన్ కోసం కృషి: ఎంపీ శబరి

నంద్యాలకు రైల్వే పిట్ లైన్ కోసం కృషి చేస్తున్నానని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. రైల్వే పిట్ లైన్ ఏర్పాటు వల్ల నంద్యాల వాసులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. రైల్వే పిట్ లైన్ అనేది నియమించబడిన ఒక ట్రాక్ అని, దీనివల్ల రైల్వే సిబ్బంది రైలు కింద సులభంగా పనిచేయడానికి వీలుంటుందని అన్నారు.


