News March 11, 2025
NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.
Similar News
News March 11, 2025
పార్వతీపురం స్పెషల్ ఆఫీసర్ భరత్ గుప్తా నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం మంగళవారం రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా ఐఏఎస్ అధికారులను నియమించింది. దీనిలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాకు ప్రత్యేక అధికారిగా ఆంధ్రప్రదేశ్ నారాయణ భరత్ గుప్తా ఐఏఎస్‌ను నియమించింది. దీంతో బాటు రాష్ట్రంలో ఉన్న 5జోన్లకు జోనల్ అధికారులను కూడా నియమించింది.
News March 11, 2025
సాగునీటికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి: కలెక్టర్

ఎండుతున్న పంటలకు సాగునీరు అందించేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలు ఉంటే అన్వేషించాలని వ్యవసాయ శాఖ అధికారులను, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. మంగళవారం ధర్పల్లి, సిరికొండ మండలాల్లో క్షేత్రస్థాయిలో ఎండిపోయిన పంటలను రైతులతో కలిసి ఆయన పరిశీలించారు. వచ్చే యాసంగిలో నీటి లభ్యత ఆధారంగా పంటలు వేసుకునే విధంగా రైతులను చైతన్యపరచాలన్నారు.
News March 11, 2025
పాడేరు: ‘గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరి’

గ్రామ రెవెన్యూ అధికారి క్షేత్ర సందర్శన తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ దినేశ్ కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సబ్ కల్లెక్టర్స్, 22 మండలాల ఎమ్మార్వోలు, వీఆర్వోలు, గ్రామ, మండల సర్వేయర్లతో మంగళవారం రెవిన్యూ అధికారుల వారాంతపు సమావేశం నిర్వహించారు. ఐవీఆర్ఎస్‌లో వచ్చిన నివేదికలో గ్రామ రెవిన్యూ అధికారి క్షేత్ర సందర్శనలు చేయటం లేదని పేర్కొన్నారు. ఎమ్మార్వోలు బాధ్యత వహించి, చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.