News March 16, 2025
NTR: రేపటి నుంచే 10th ఎగ్జామ్స్

జిల్లాలో 10 పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు DEO U.V సుబ్బారావు ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 31,231 మంది విద్యార్థులు 168 పరీక్షా కేంద్రాలలో పరీక్షలు రాయబోతున్నట్లు తెలిపారు. జిల్లాలోని 6 సమస్యాత్మక కేంద్రాలలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని చెప్పారు. విద్యార్థులను పరీక్ష కేంద్రాల్లోనికి అరగంట ముందే అనుమతిస్తారని, మొబైల్ /ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదన్నారు.
Similar News
News November 6, 2025
10న ఉమ్మడి జిల్లా స్థాయి వాలీబాల్ ఎంపిక ఎంపిక పోటీలు

జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 10న ఉమ్మడి జిల్లా స్థాయి సీనియర్ మహిళల, పురుషుల వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్స్ బాన్సువాడలోని మినీ స్టేడియంలో నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు N.V. హన్మంత్ రెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపుతామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఫిజికల్ డైరెక్టర్ సురేందర్‌ను సంప్రదించాలన్నారు.
News November 6, 2025
ప్రతి గర్భిణీ, బాలింతలకు పరీక్షలు చేయాలి: ADB కలెక్టర్

ఆరోగ్య సమస్యలు తలెత్తినప్పుడు సమయానికి చికిత్స అందకపోవడం వంటి కారణాల వల్ల తక్కువ బరువుతో పుట్టిన శిశువుల సంఖ్య పెరుగుతోందని కలెక్టర్ రాజర్షి షా ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య, శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ, బాలింతలను గుర్తించి సమయానికి వైద్యపరీక్షలు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. సరైన పోషకాహారం అందించడంలో సిబ్బంది చురుకుగా వ్యవహరించాలన్నారు.
News November 6, 2025
భద్రాచలం బస్ సర్వీస్ పునరుద్ధరణ: జిల్లా ఆర్టీసీ అధికారి

పాడేరు నుంచి భద్రాచలానికి ఆర్టీసీ బస్ సర్వీస్ పునరుద్ధరిస్తున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి పి.శ్రీనివాస్ రావు బుధవారం తెలిపారు. పాడేరు నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు చేరుతుందన్నారు. అలాగే భద్రాచలం నుంచి ఉదయం 7 గంటలకు బయలుదేరి సాయంత్రానికి పాడేరు చేరుతుందన్నారు. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం ఉందని ఆర్టీసీ అధికారి తెలిపారు.


