News February 11, 2025

NTR: రైలు కిందపడి వ్యక్తి మృతి

image

రైలు కిందపడి ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వ్యక్తి మృతి చెందిన ఘటన TSలో చోటు చేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ తెలంగాణలోని మధిర రైల్వే స్టేషన్ పరిధిలో జైపూరు – చెన్నై ఎక్స్‌ప్రెస్ కిందపడ్డాడు. దీంతో అతని తల తెగిపోయింది. లోకో ఫైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News February 11, 2025

అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.

News February 11, 2025

జేఈఈ రిజల్ట్స్: ఏపీ, టీజీ విద్యార్థులకు 100 పర్సంటైల్

image

జేఈఈ మెయిన్ తొలి సెషన్ <<15430043>>ఫలితాల్లో<<>> తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తా చాటారు. ఏపీకి చెందిన గుత్తికొండ మనోజ్ఞ, తెలంగాణకు చెందిన బనిబ్రత మాజీ 100 పర్సంటైల్ సాధించారు. ఏపీ విద్యార్థి కోటిపల్లి యశ్వంత్ సాత్విక్‌కు 99.99 పర్సంటైల్ వచ్చింది. కాగా దేశవ్యాప్తంగా మొత్తం 14 మంది 100 పర్సంటైల్ సాధించారు.

News February 11, 2025

ప్రముఖ క్రికెటర్ రిటైర్మెంట్

image

దేశవాళీ క్రికెట్‌లో టన్నుల కొద్దీ పరుగులు చేసిన షెల్డన్ జాక్సన్ రిటైర్మెంట్ ప్రకటించారు. సౌరాష్ట్రకు ప్రాతినిధ్యం వహించిన ఇతను ఫస్ట్ క్లాస్+లిస్ట్ A+T20లలో పదివేలకు పైగా పరుగులు చేశారు. ఇందులో 31 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అయితే జాతీయ జట్టుకు మాత్రం ఎంపిక కాలేదు. IPLలో RCB, KKR జట్లు ఇతడిని కొనుగోలు చేసినప్పటికీ కేవలం 9 మ్యాచ్‌ల్లోనే ఆడే అవకాశం వచ్చింది.

error: Content is protected !!