News September 26, 2024

NTR: రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకులు మృతి

image

ఏ.కొండూరు అడ్డరోడ్డులో బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తండ్రి కొడుకులను లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. మామిళ్ల శ్రీనివాసరావు(45), కుమారుడు ప్రసంగి(16) షాపు క్లోజ్ చేసి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నారు. వెనుకనుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 20, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* విజయవాడలో కూతురి పట్ల తండ్రి అసభ్య ప్రవర్తన
* చంద్రబాబును జైళ్లో వేయాలి: పేర్ని నాని
* విజయవాడలో ప్రమాదం.. ఒకరి మృతి
* పెనమలూరు: KTM పండుకు పీటీ వారెంట్
* బందరులో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
* విజయవాడ బెంజి సర్కిల్‌లో చీకటి వ్యాపారం

News February 20, 2026

కృష్ణా: నిందితులపై పోలీసుల ఫోకస్..!

image

కృష్ణాజిల్లాలో కరుడుగట్టిన నేరస్తులపై పోలీసులు ఫోకస్ పెట్టారు. SP విద్యాసాగర్ ఆదేశాల మేరకు నేరస్థుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు. హత్యలు, అత్యాచారాలు, ఇతర నేరాలకు పాల్పడుతూ శాంతిభద్రతలకు విఘాతంగా మారిన వారి పట్ల చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు వివరించారు. ఇటువంటి వారికి PT వారెంట్ల జారీకి కూడా వెనుకాడటం లేదని, తాజాగా పెనమలూరు PS పరిథిలోని నిందితుడు KTM పండుకు PT వారెంట్ జారీ చేశారన్నారు.

News February 19, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

వసతి గృహాల్లో అంటి వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు: కృష్ణా కలెక్టర్
* ఇన్‌స్టా పరిచయం.. ఝార్ఖండ్ నుంచి బందరుకు వివాహిత
* కృష్ణాలో బెల్ట్ షాపుల జోరు.. మామూళ్ల హోరు.!
* మచిలీపట్నం: బస్సులో గుండెపోటుతో వ్యక్తి మృతి
* విజయవాడ గాంధీ హిల్స్‌లో యువత వెకిలి చేష్టలు.!
* కృష్ణా : పది పరీక్షలకు 297 కేంద్రాలు.. 61 సమస్యాత్మక కేంద్రాలు