News December 19, 2025
NTR: లాడ్జిలో వ్యభిచారం.. ఐదుగురి అరెస్ట్

విజయవాడ గాంధీనగర్‌లోని ఓ లాడ్జిలో గురువారం సత్యనారాయణపురం పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. లాడ్జి కేంద్రంగా అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారంతో తనిఖీలు చేపట్టగా.. వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనలో నలుగురు మహిళలతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నట్లు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 25, 2025
198 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TGSRTCలో 198 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ 84, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 114 ఉద్యోగాలను TSLPRB భర్తీ చేయనుంది. ఈ నెల 30 నుంచి జనవరి 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నెలకు పేస్కేల్ రూ.27,080-రూ.81,400 ఉంటుంది. అర్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు <
News December 25, 2025
ఇద్దరు మంత్రులు జైలుకెళ్లడం ఖాయం: బండి సంజయ్

TG: రాష్ట్రంలోని ఇద్దరు మంత్రులు ₹వేల కోట్ల ఆస్తులు కూడబెట్టారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. వీరిపై కేంద్ర సంస్థలు నిఘా వేశాయని, ఎప్పటికైనా జైలుకెళ్లడం ఖాయమని మీడియాతో చిట్‌చాట్లో వ్యాఖ్యానించారు. ‘TGకి పట్టిన శని KCR కుటుంబం. అందుకే ప్రజలు ఫామ్‌హౌస్‌కు పరిమితం చేశారు. నీటివాటాలలో తప్పుచేసింది కేసీఆరే. CM రేవంత్ భాష సరికాదు. KCRను తిట్టడం వెనుక సింపతీ పెంచే కుట్ర ఉంది’ అని పేర్కొన్నారు.
News December 25, 2025
దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యం: శివరాజ్ సింగ్

AP: ప్రభుత్వమేదైనా దేశభద్రతకే వాజ్‌పేయి ప్రాధాన్యమిచ్చేవారని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కొనియాడారు. ‘ఇది నాదేశం అనే భావన ప్రజల్లో చిరస్థాయిగా నిలిచేలా వాజ్‌పేయి పనిచేశారు. పాక్‌తో యుద్ధంలో ఇందిరకు మద్దతు ఇచ్చారు. కానీ నేడు ఆమె మనవడు రాహుల్ ఆపరేషన్ సింధూర్‌ను, మోదీని విమర్శిస్తున్నారు’ అని అమరావతిలో విగ్రహావిష్కరణ సభలో పేర్కొన్నారు. AP రైతుల సంక్షేమానికి కేంద్రం తరఫున సహకరిస్తానన్నారు.


