News April 3, 2025
NTR: వాయిదా పడిన డిగ్రీ పరీక్షలు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో 2025 ఏప్రిల్ 5న నిర్వహించనున్న డిగ్రీ 4వ సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలు వాయిదాపడ్డాయి. 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని పబ్లిక్ హాలిడే ప్రకటించినందున ఆ రోజు జరగాల్సిన 4వ సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 15న మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తామని ANU పరీక్షల విభాగం తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది.
Similar News
News February 28, 2026
మెదక్: నాలుగో రోజు ఇంటర్ పరీక్షలు ప్రశాంతం

జిల్లాలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (DIEO) మాధవి తెలిపారు. జనరల్ విభాగంలో 4,869 మందికి గాను 4,799 మంది, ఒకేషనల్ విభాగంలో 540 మందికి గాను 525 మంది విద్యార్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. మొత్తంగా 98.42% హాజరు నమోదైందని వివరించారు.
News February 28, 2026
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 5(JRF, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. MSc(లైఫ్ సెన్సెస్) అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 25వరకు అప్లై చేసుకోవచ్చు. JRFకు నెలకు రూ.46,990, ప్రాజెక్ట్ అసిస్టెంట్స్‌కు రూ.30,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://uohyd.ac.in
News February 28, 2026
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శనివారం జరిగిన ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 7,791 మంది విద్యార్థులు హాజరైనట్లు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. మొత్తం 7,958 మందికి గాను 167 మంది గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఆయన వివరించారు. నిబంధనల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.


