News February 20, 2026
NTR: విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్ విడుదల

ANU పరిధిలోని కాలేజీలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్(బీ.ఆర్క్) విద్యార్థులు R22 బ్యాచ్(రెగ్యులర్) రాయాల్సిన I/V 1, 2వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ పరీక్షలు మార్చి 10 నుంచి నిర్వహిస్తామని, విద్యార్థులు ఎలాంటి ఫైన్ లేకుండా ఈ నెల 26లోపు రూ.100 ఫైన్‌తో 27లోపు ఫీజు చెల్లించాలని ANU సూచించింది. వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ సందర్శించాలని పేర్కొంది.
Similar News
News February 20, 2026
భూపాలపల్లి జిల్లాలో 60.92% ఫార్మర్ రిజిస్ట్రేషన్

భూపాలపల్లి జిల్లాలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ పట్ల రైతులు ఆసక్తి కనపరచడం లేదు. జిల్లాలో ఇప్పటివరకు 60.92 శాతం మంది రైతులు మాత్రమే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. జిల్లాలో 1,24,107 మంది రైతులు ఉండగా.. 75,615 మంది రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 48,492 మంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్‌కు నెలాఖరు వరకు గడువు విధించారు.
News February 20, 2026
విశాఖ: స్పీడ్ బ్రేకర్ వచ్చింది.. వాహనం విరిగింది

విశాఖ కలెక్టర్ ఆఫీస్ జంక్షన్ వద్ద ఓ వాటర్ సప్లై వాహనం ప్రమాదానికి గురైంది. రోడ్డుపై ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను దాటుతున్న సమయంలో ట్యాంకర్ ముందు భాగం పూర్తిగా విరిగిపోయింది. కేవలం ఒక స్పీడ్ బ్రేకర్‌ను దాటుతుండగానే వాహనం ఈ స్థాయిలో దెబ్బతినడం చూసిన స్థానికులు ఆశ్చర్య పోయారు. ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల ఫిట్‌నెస్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
News February 20, 2026
‘చేతకాకుంటే చెప్పండి’.. పోలీసుల తీరుపై సుప్రీం ఫైర్

AP: MLC అనంతబాబు డ్రైవర్ హత్యకేసులో పోలీసుల తీరుపై SC ఆగ్రహం వ్యక్తం చేసింది. వారికి చేతకాకుంటే CBIకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. దర్యాప్తులో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తూ సాగదీస్తున్నారని మండిపడింది. అభియోగాలపై ఏప్రిల్ 18లోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నవంబర్ 30లోపు ట్రయల్ పూర్తిచేయాలని స్పష్టం చేసింది. అప్పటివరకు అనంతబాబు బెయిల్‌ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది.


