News September 10, 2025
NTR: వైద్యశాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

NTR వైద్యసేవలో 48 డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి(టెక్నికల్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. APMC రిజిస్ట్రేషన్ కలిగి MBBS పూర్తి చేసినవారు ఈ పోస్టులకు అర్హులని, https://apmsrb.ap.gov.in/msrb/లో ఈ నెల 15లోపు దరఖాస్తు చేసుకోవాలని AP మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు మెంబర్ సెక్రటరీ M.V. సూర్యకళ తెలిపారు. దరఖాస్తు విధానం, వేతనం తదితర వివరాలకు పై వెబ్‌సైట్ చూడాలన్నారు.
Similar News
News September 10, 2025
డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

డ్రాపౌట్స్ రహిత బడులుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. బుధవారం సమగ్ర శిక్ష APC మద్దిపట్ల వెంకటరమణతో కలిసి MEO, CRC హెచ్ఎంలతో రివ్యూ నిర్వహించారు. పాఠశాల వారీగా డ్రాప్స్ జాబితా ఇవ్వాలని సూచించారు. పిల్లలు 100% పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. మిడ్ డే మీల్స్, హ్యాండ్ బుక్, FA-1 మార్కులు, CRC గ్రాండ్స్, MRC గ్రాండ్స్ పై రివ్యూ చేపట్టారు.
News September 10, 2025
‘అఖండ-2’కు OTT రైట్స్ @రూ.80కోట్లు?

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతోన్న ‘అఖండ-2’ మూవీ డిజిటల్ రైట్స్ రూ.80+ కోట్లు పలికినట్లు సినీ వర్గాలు తెలిపాయి. OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ దీనిని దక్కించుకుందని పేర్కొన్నాయి. ‘అఖండ’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంది. ఈ మూవీని డిసెంబర్ తొలివారంలో రిలీజ్ చేస్తామని ఇటీవల బాలయ్య తెలిపారు.
News September 10, 2025
గద్వాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*గద్వాల: చాకలి ఐలమ్మ వర్ధంతి.
*లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోండి.
*పిడుగుపడి ముగ్గురు మృతి. *గట్టు: GPభవన నిర్మాణానికి భూమి పూజ.
*మల్దకల్: కాంగ్రెస్ నేత కు BRSలోకి రావాలని ఆహ్వానం. *అయిజ: గ్రామీణ క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించాలి *అలంపూర్: నవరాత్రి ఉత్సవాల పోస్టర్ విడుదల.
*మానవపాడు: ఉద్యోగులకు బదిలీలు సహజం.
*ఎర్రవల్లి: ఐలమ్మ స్ఫూర్తితో పోరాటాలు చేయాలి.
*ధరూర్: జూరాల గేట్లు మూసివేత.