News December 26, 2025
NTR: సీఎం ఆదేశాలు బేఖాతరు.. DRCకి పాలకుల డుమ్మా!

NTR జిల్లా ప్రగతి, అభివృద్ధిపై శుక్రవారం విజయవాడలో మంత్రి సత్యకుమార్ DRC సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జగ్గయ్యపేట MLA శ్రీరామ్ తాతయ్య పాల్గొన్నారు. MP కేశినేని, మిగతా MLAలు డుమ్మా కొట్టారు. నియోజకవర్గాల్లోని సమస్యల పరిష్కారానికి దోహదపడే ఈ సమావేశానికి నేతల గైర్హాజరుపై విమర్శలొస్తున్నాయి. DRCలో ప్రజాప్రతినిధులు తప్పక పాల్గొనాలని CM చంద్రబాబు ఇప్పటికే ఆదేశించినా నేతలు బేఖాతరు చేయడం గమనార్హం.
Similar News
News December 27, 2025
MDK: న్యూ ఇయర్ జోష్.. ఎస్పీ కీలక సూచనలు

న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
News December 27, 2025
పూజలో ఈ పొరపాట్లు ఫలితాలనివ్వవు..

పూజలో కొన్ని నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది. పూజా స్థలాన్ని, విగ్రహాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాడిపోయిన పూలు, మురికి పాత్రలు వాడితే పూజ శక్తి తగ్గుతుంది. పూజను తొందరగా ముగించే పనిలా కాకుండా, ఏకాగ్రతతో ముహూర్త సమయాలను అనుసరించి చేయాలి. విగ్రహాలను నేల మీద పెట్టకుండా సరైన పీఠంపై ఉంచాలి. పూజ పూర్తయ్యాక పాత వస్తువులను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.
News December 27, 2025
ఈ IT ఉద్యోగులది చెప్పుకోలేని బాధ!

30-40 ఏళ్ల వయసున్న IT ఉద్యోగులకు గడ్డుకాలం నడుస్తోంది. ఓవైపు ప్రమోషన్లు లేక మరోవైపు లేఆఫ్‌లతో ఇబ్బంది పడుతున్నారు. పెరుగుతున్న EMIలు, ఫ్యామిలీ బాధ్యతల మధ్య AI టెక్నాలజీని అందిపుచ్చుకోవడం సవాల్‌గా మారింది. Gen Z కుర్రాళ్లు తక్కువ జీతానికే AIతో స్మార్ట్‌గా పనిచేస్తుంటే సీనియర్స్ తమకు భారంగా మారారని కంపెనీలు భావిస్తున్నాయి. ఒక్కసారి జాబ్ పోతే Bounce Back అవ్వడం ఇప్పుడు అంత ఈజీ కాదు.


