News April 15, 2025

NTR: సీఎం పర్యటన ప్రాంతం పరిశీలన: సీపీ

image

ఈ నెల 16న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ భవానిపురం బేరం పార్క్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభా ప్రాంగణాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు పరిశీలించారు. అదేవిధంగా బందోబస్తు ఏర్పాటులపై అధికారులకు, సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. పార్కింగ్ ప్రదేశాలు, పరిసర ప్రాంతాల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ తెలిపారు.

Similar News

News December 26, 2025

లిప్ లైనర్ వాడుతున్నారా?

image

లిప్‌స్టిక్ వేసుకొనేముందు లిప్ లైనర్ వాడటం ముఖ్యం. దీని వల్ల మీ లిప్‌స్టిక్ కిందికి, పైకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుందంటున్నారు ఫ్యాషన్ నిపుణులు. అలాగే ఇది పెదాలకు సరైన షేప్ ఇస్తుందని చెబుతున్నారు. లైనర్‌తో పెదాల చుట్టూ ఔట్ లైన్ గీసి తర్వాత లిప్‌స్టిక్ వెయ్యాలి. లిప్‌స్టిక్ వేశాక తప్పనిసరిగా టిష్యూతో లిప్స్‌ని ప్రెస్ చేయండి. ఇది స్మడ్జింగ్, ఎక్స్‌ట్రా లిప్‌స్టిక్‌ని దూరం చేస్తుందని సూచిస్తున్నారు.

News December 26, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాస్త తగ్గిన చలి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కాస్త తగ్గింది. జగిత్యాల జిల్లా భీమారం మండలంలోని మన్నెగూడెంలో 10.8℃, మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.8℃, రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలోని నిజామాబాద్‌లో 10.9℃, పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని ఆకెనపల్లిలో 11.1℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌ నగర్‌లో 11.2℃ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News December 26, 2025

మానసిక ధైర్యాన్ని అందించే మహాకాళి అమ్మవారు

image

దశమహావిద్యలలో మొదటి రూపమైన శ్రీ మహాకాళీ దేవి శక్తికి, పరివర్తనకు ప్రతిరూపం. కృష్ణ వర్ణంతో ప్రకాశించే ఈమెను ఆరాధిస్తే సకల వ్యాధులు, గ్రహ దోషాలు, శత్రుపీడలు తొలగిపోతాయని నమ్మకం. తంత్రోక్త మార్గంలో ఈ మహావిద్యను ఉపాసించే వారికి మానసిక ధైర్యం, సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయువు సిద్ధిస్తాయి. అమ్మవారి అనుగ్రహంతో జీవితంలో విజయం లభిస్తుంది. సాధకులకు రక్షణ కవచంలా నిలిచి, మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తుంది.