News October 29, 2025

NTR: సెలవులపై క్లారిటీ ఇచ్చిన డీఈవో

image

ఎన్టీఆర్ జిల్లాలోని విద్యాసంస్థలకు ఈ నెల 31 వరకు సెలవులు ప్రకటించినట్లు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న సందేశం అవాస్తవమని డీఈవో సుబ్బారావు స్పష్టం చేశారు. ప్రధానోపాధ్యాయులు అధికారికంగా విడుదల కాని సమాచారాన్ని నమ్మకూడదని, ప్రచారం చేయకూడదని కోరారు. ఏదైనా సమాచారం ఉంటే కార్యాలయం మాత్రమే అధికారిక సందేశాలను విడుదల చేస్తుందని ఆయన తెలిపారు.

Similar News

News October 29, 2025

అన్నమయ్య: యువతిని మోసం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

image

యువతిని మోసం చేసిన వ్యక్తికి కడప 7వ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి బుధవారం జీవిత ఖైదుతోపాటు రూ.1.6 లక్షల జరిమానా విధించింది. ఆ వివరాలను అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయ అధికారులు వెల్లడించారు. రైల్వే కోడూరు మండలం రెడ్దివారిపల్లికి చెందిన గొంతు సుబ్రమణ్యం, అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని మోసం చేశాడు. దీంతో ఆ బాదితురాలు 2022లో కోడూరు పోలీసులని ఆశ్రయించగా నేడు శిక్ష పడింది.

News October 29, 2025

వరంగల్ జిల్లాలో వర్ష బీభత్సం

image

వరంగల్ జిల్లా మొత్తాన్ని వర్షాలు చుట్టుముట్టాయి. జిల్లాలో కేవలం ఒక్కరోజులో (ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు) 1245.4 మి.మీ. భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా వర్ధన్నపేట (143.8 మి.మీ), నెక్కొండ (143.7 మి.మీ), పర్వతగిరి (130.5 మి.మీ), రాయపర్తి (115.3 మి.మీ) మండలాల్లో కురిసినట్లు రికార్డులు చెబుతున్నాయి.

News October 29, 2025

HYD: మంత్రి దృష్టికి సబ్సిడీ మీటర్ల సమస్య!

image

రజక, నాయి బ్రాహ్మణుల 250 యూనిట్ల ఉచిత కరెంటుకు సంబంధించిన సబ్సిడీ మీటర్లను తొలగించడంపై ప్రభుత్వం వెంటనే తగిన విధంగా చర్యలు తీసుకోవాలని గ్రేటర్ HYD బీసీ ప్రధాన కార్యదర్శి రంజిత్ సింగ్ డిమాండ్ చేశారు. కొన్ని చోట్ల మీటర్లను డిస్కనెక్ట్ చేయడం, మీటర్లు ఉంటే కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ వేస్తామని GHMC అధికారులు నోటీసులిస్తున్నట్లు తెలిపారు. దీనిని త్వరలో మంత్రి పొన్నం ప్రభాకరుకూ విన్నపించనున్నారు.