News February 17, 2026
NTR: స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం!

VJA కార్పొరేషన్ పరిధిలో స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మాణంలో గందరగోళం నెలకొంది. వీటి నిర్మాణానికి 2018లో కేంద్రం రూ.460 కోట్లను కేటాయించగా L&T సంస్థ పనులను చేపట్టింది. అప్పట్లో 59% పనులకు రూ.211 కోట్లు ఖర్చు చేశారు. మిగిలిన 41% పనులకు రూ.600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రస్తుత బడ్జెట్‌తో కొత్తగా డ్రైన్స్ నిర్మిస్తారా..? లేదా మిగిలిన పనులనే కొనసాగిస్తారా అన్నదానిపై చర్చలు సాగుతున్నాయి.
Similar News
News April 17, 2026
భారత్‌కు సౌత్ కొరియా అధ్యక్షుడు

సౌత్ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ భారత్ పర్యటనకు రానున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఈ నెల 19వ తేదీ ఢిల్లీకి చేరుకుంటారు. 20వ తేదీ ప్రధాని మోదీతో భేటీ అవుతారు. ఆర్థిక, రక్షణ తదితర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునే దిశగా లీ పర్యటన సాగనుంది. మరోవైపు పశ్చిమాసియా పరిణామాలు సహా అనేక కీలకాంశాలు ఇద్దరు నేతల మధ్య చర్చకు వచ్చే అవకాశమున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
News April 17, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ వసతులు కల్పించాలి: లోకేశ్

ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ కీలక సమీక్ష నిర్వహించారు. విద్యాసంస్థల్లో సిబ్బంది, విద్యార్థుల కోసం అమలు చేస్తున్న ముఖ ఆధారిత గుర్తింపు పురోగతిపై ఆరా తీశారు. పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యపై చర్చించిన ఆయన, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘త్రీ స్టార్’ ప్రమాణాలతో కూడిన మౌలిక సదుపాయాలు కల్పించాలని, విద్యార్థులకు అత్యుత్తమ వసతులు అందించాలని అధికారులను ఆదేశించారు.
News April 17, 2026
అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి భూప్రకంపనలు

అనకాపల్లి జిల్లా పరిధిలో గురువారం అర్ధరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. సుమారు 12:31 గంటల సమయంలో 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించినట్లు సమాచారం. ఉమ్మడి విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు సంభవించినట్లు సోషల్ మీడియాలో పలువురు పోస్టులు చేస్తున్నారు. మీ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయా? కామెంట్ చేయండి.


