News February 13, 2026

NTR: 18తో ముగియనున్న ఫీజు చెల్లింపు గడువు

image

కృష్ణా యూనివర్సిటీ (KRU) పరిధిలోని కళాశాలల్లో DEC 2025లో నిర్వహించిన LLM 3వ సెమిస్టర్ (2025-26 అకడమిక్ ఇయర్) పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షలకు సంబంధించి రీ వాల్యుయేషన్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 18వ తేదీలోగా ఒక్కో పేపరుకు రూ. 900 ఫీజు https://onlinesbi.com ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుందని పరీక్షల విభాగం కంట్రోలర్ వీరబ్రహ్మచారి సూచించారు.

Similar News

News March 12, 2026

వనపర్తి డిపోకు రూ.10 కోట్ల ఆదాయం: ఎమ్మెల్యే

image

కేవలం రెండేళ్లలో వనపర్తి ఆర్టీసీ డిపోకు దాదాపు రూ.10 కోట్ల పైనే ఆదాయం సమకూరిందని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. గత BRS హయంలో దివాలా తీసిన ఆర్టీసీ ప్రస్తుతం లాభాల బాటలో కొనసాగుతుందన్నారు. వనపర్తి డిపోకు సంబంధించి రోజుకు రూ.4 లక్షలు ఉండే ఆర్టీసీ ఆదాయం నేడు రూ.30 నుంచి రూ.35 లక్షలకు పెరిగిందన్నారు. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన RTC డిపో కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి చెందిందన్నారు.

News March 12, 2026

అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

image

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.

News March 12, 2026

పెట్రోల్, డీజిల్ ఉంది.. ఆందోళన వద్దు: IOCL

image

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత లేదని ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది. దేశంలోని అన్ని ఇండియన్ ఆయిల్ బంకులు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని, సరిపడా నిల్వలు ఉన్నాయని తెలిపింది. ఎలాంటి ఇబ్బంది లేకుండా పెట్రోల్, డీజిల్ సప్లై చేస్తున్నామని, వాహనదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.