News May 10, 2024
NTR: 50% పైబడి ఓట్లు సాధించి నేడు పోటీకి దూరంగా..

2014, 2019లో తిరువూరు నియోజకవర్గంలో వైసీపీ తరఫున గెలిచిన కొక్కిలిగడ్డ రక్షణనిధి తాజా ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు. 2019 ఎన్నికలలో ఆయన పోలైన ఓట్లలో 50.73% ఓట్లు సాధించి టీడీపీ అభ్యర్థి KS జవహర్‌పై 10,835 ఓట్ల మెజారిటీతో గెలుపును సొంతం చేసుకున్నారు. తాజా ఎన్నికల్లో రక్షణనిధిని కాదని, వైసీపీ నల్లగట్ల స్వామిదాసుకు టికెట్ ఇవ్వడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
Similar News
News April 22, 2025
కృష్ణా : ‘కోర్టు కేసుల్లో నిర్లక్ష్యం తగదు’

కోర్టు కేసులకు సంబంధించి వకాలత్, కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయడంలో నిర్లక్ష్యం వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డీకే బాలాజీ హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమానికి ముందుగా జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి వివిధ అంశాలపై సమీక్షించారు.
News April 21, 2025
కృష్ణా: ట్రై సైకిల్ పంపిణీ చేసిన కలెక్టర్

సమాజంలో ఇతరుల మాదిరిగానే విభిన్న ప్రతిభావంతులు చాలా గర్వంగా బ్రతకాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని కలెక్టరేట్లో పాఠశాల విద్య – సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో కలెక్టర్ దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను ఉచితంగా పంపిణీ చేశారు.
News April 21, 2025
కృష్ణా: 131 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత

జిల్లాలో 131 మంది విభిన్న ప్రతిభావంతులకు ఉపకరణాలు సైకిళ్లను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అందించారు. మెడికల్ క్యాంప్‌ల ద్వారా గుర్తించిన వీరికి రూ.15లక్షలు విలువ చేసే ట్రై సైకిల్స్, ఇతర ఉపకరణాలను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అందరితోపాటు పాఠశాలల్లో సమానంగా చదువుకోవడానికి ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.