News December 14, 2024
అల్లు అర్జున్‌కు ఎన్టీఆర్, ప్రభాస్ ఫోన్ కాల్

తొక్కిసలాట కేసులో అరెస్టై బెయిల్‌పై విడుదలైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారు. అరెస్ట్ ఘటనపై వివరాలను వారు ఆరా తీశారు. మరోవైపు ముంబైలో వార్-2 షూటింగ్లో బిజీగా ఉండటంతో వచ్చాక కలుస్తానని ఎన్టీఆర్ తెలిపినట్లు సమాచారం. అంతకుముందు బాలకృష్ణ కూడా అల్లు అర్జున్‌కు కాల్ చేశారు.
Similar News
News December 12, 2025
విశాఖ నుంచి సేవలు అందించనున్న IT సంస్థలు

AP: CM CBN కాగ్నిజెంట్ సహా 8 IT సంస్థల భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. కాగ్నిజెంట్ నిర్మాణం 3 దశల్లో పూర్తి కానుంది. కాగా ఈ సంస్థలన్నీ విశాఖ నుంచి తమ కార్యకలాపాలు నిర్వహించనున్నాయి. వీటి ద్వారా రాష్ట్రానికి ₹3,740 కోట్ల పెట్టుబడులు, దాదాపు 41,700 మందికి ఉద్యోగావకాశాలు రానున్నాయి. ఇప్పటికే VSP నుంచి 150కి పైగా కంపెనీలు సేవలందిస్తున్నాయని, ఐటీ నిపుణులకు అవకాశాలు పెరిగాయని ప్రభుత్వం పేర్కొంది.
News December 12, 2025
వైట్ డిశ్చార్జ్‌కి ఇలా చెక్ పెట్టండి

చాలామంది మహిళలకు వివిధ కారణాల వల్ల వైట్ డిశ్చార్జ్ జరుగుతుంది. దీనికి బియ్యం కడిగిన నీరు పరిష్కారం చూపుతుందంటున్నారు నిపుణులు. ఈ నీటిని తాగడం వల్ల వైట్ డిశ్చార్జ్ సమస్య తగ్గడంతో పాటు చర్మం, జుట్టుకు కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు. అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట, విరేచనాలు, రక్తస్రావానికి సంబంధించిన రుగ్మతలు, పీరియడ్స్‌లో అధిక రక్తస్రావం వంటి అనేక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు.
News December 12, 2025
అఖండ-2 మూవీ నిర్మాతలకు ఊరట

TG: అఖండ-2 మూవీ నిర్మాతలకు హైకోర్టు డివిజన్ బెంచ్‌లో ఊరట దక్కింది. టికెట్ ధరల పెంపు జీఓను రద్దు చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సస్పెండ్ చేసింది. అందరి వాదనలు వినకుండా సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిందంటూ 14రీల్స్ సంస్థ డివిజన్ బెంచ్‌కు వెళ్లగా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ అందరి వాదనలు వినాలని పేర్కొంది. ఈ కేసు విచారణ మళ్లీ అక్కడే జరగాలని తెలిపింది.


