News September 9, 2024
ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, సందీప్ రెడ్డి వంగా

‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ చోటకు చేరారు. ‘దేవర’ సినిమా ట్రైలర్ ఈవెంట్ రేపు ముంబైలో జరగనుండగా అక్కడ వీరిద్దరూ కలిసినట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ట్రైలర్ ఈవెంట్లో సూపర్ స్టార్ మహేశ్‌బాబుతో పాటు సందీప్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. అయితే, వీరిద్దరి కాంబోలో సినిమా వస్తే ఓ రేంజ్లో ఉంటుందని అభిమానులు వీరి ఫొటోను షేర్ చేస్తున్నారు.
Similar News
News September 3, 2025
రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చాలి: అశోక్

AP: నిరుపయోగంగా ఉన్న రుషికొండ ప్యాలెస్‌ను మెంటల్ ఆసుపత్రిగా మార్చడం మంచిదని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు సలహా ఇచ్చారు. ఆ భవనంలో పెచ్చులు ఊడాయని తెలిసిందన్నారు. ఈ ప్యాలెస్‌ను ఏం చేస్తే మంచిదో ప్రజలే చెప్పాలని ఆయన కోరారు. గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో క్షత్రియ సేవా సమితి విశాఖలో అశోక్ గజపతిరాజును సత్కరించింది.
News September 3, 2025
హీరో రాజ్ తరుణ్‌పై మరో కేసు

టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్‌పై నార్సింగి PSలో మరోసారి కేసు నమోదైంది. జూన్ 30న రాజ్ తరుణ్ అనుచరులతో కలిసి తన కుటుంబసభ్యులపై దాడి చేశారని మాజీ ప్రేయసి లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంగారం ఎత్తుకెళ్లడంతో పాటు కుక్కను చంపారని ఆరోపించారు. ఈ ఘటనలో తన తండ్రి గాయపడినట్లు తెలిపారు. ఇది సైబరాబాద్ సీపీ దృష్టికి వెళ్లగా ఆయన ఆదేశాలతో నార్సింగి పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
News September 3, 2025
యూరియా సమస్య ఎందుకొచ్చింది: జగన్

AP: రైతులకు యూరియా కూడా ఇవ్వలేని అధ్వాన స్థితిలో కూటమి పాలన ఉందని YCP చీఫ్ జగన్ ధ్వజమెత్తారు. ‘బస్తా యూరియా కోసం రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. సీజన్లో సాగయ్యే పంటల విస్తీర్ణం, ఎంత మొత్తంలో ఎరువుల పంపిణీ చేయాలనేది ఏటా జరిగే కసరత్తే కదా. మరి యూరియా సమస్య ఎందుకొచ్చింది? మా పాలనలో ఈ సమస్య రాలేదు. ఎరువులను మీ పార్టీ నాయకులే దారి మళ్లించి అధిక ధరకు అమ్ముకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు.