News August 11, 2024
NTR: ATMలో రూ.8 వేలు డ్రా చేస్తే రూ.9,500 వచ్చాయ్

ATMలో డ్రా చేసిన నగదు కంటే ఎక్కువ వచ్చి కలకలం సృష్టించింది. తిరువూరు రాజుపేటలోని SBI ATMలో అధికారులు నగదు పొందు పరిచారు. శనివారం ఉదయం ఓ ఖాతాదారుడు రూ.8 వేలు డ్రా చేయగా ATM నుంచి రూ.9,500 వచ్చాయి. మరొకరికి రూ.5 వేలకు గాను రూ.7 వేలు రావడంతో విషయం అందరికీ తెలిసింది. దీంతో ఆ ATM వద్దకు జనాలు బారులు తీరారు. సాంకేతిక లోపంతో ఇది జరిగిందని, ATM మూసేశారు. మరోవైపు డ్రా చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు.
Similar News
News December 1, 2025
కృష్ణా జిల్లాలో యధావిధిగానే పాఠశాలలు: డీఈఓ

కృష్ణాజిల్లాలో సోమవారం యధావిధిగా పాఠశాలలు కొనసాగుతాయని డీఈఓ రామారావు తెలిపారు. దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఇప్పటి వరకు భారీ వర్షాలు పడని కారణంగా పాఠశాలలను యధావిధిగా కొనసాగిస్తున్నామన్నారు. భారీ వర్షాలు పడితే కలెక్టర్ ఆదేశాల మేరకు ఓ నిర్ణయం తీసుకుంటామన్నారు. తీర ప్రాంత మండలాల్లో అక్కడి పరిస్థితులను బట్టి తహశీల్దార్లు స్కూల్స్ శెలవుపై నిర్ణయం తీసుకుంటారన్నారు.
News November 30, 2025
కృష్ణా జిల్లాలో 1.1మి.మీలు వర్షపాతం నమోదు

దిత్వా తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో 1.1 మి.మీల సరాసరి వర్షపాతం నమోదైంది. ఈ వర్షపాతం ఆదివారం ఉదయం 8.30ని.ల నుంచి రాత్రి 8గంటల వరకు నమోదైనట్టు అధికారులు తెలిపారు. అత్యధికంగా నాగాయలంకలో 2.6 మి.మీలు, కోడూరులో 2.2మి.మీలు, అవనిగడ్డ, మోపిదేవిలలో 2.0మి.మీలు, చల్లపల్లి, కంకిపాడులలో 1.8మి.మీలు చొప్పున వర్షపాతం నమోదైంది.
News November 30, 2025
కృష్ణాజిల్లాలో ఎంత మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారంటే.?

కృష్ణాజిల్లాలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. తాజా అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 7,072 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరంతా మచిలీపట్నం సర్వజన ప్రభుత్వ ఆస్పత్రి, గుడివాడలోని పీ. సిద్దార్థ మెడికల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 2008 గణాంకాల ప్రకారం జిల్లాలో మొత్తం 12,052 మంది ఉండగా తాజా గణాంకాల ప్రకారం ఆ సంఖ్య 7,072 మందికి తగ్గింది. #InternationalAidsDay.


