News September 27, 2024
రాజమౌళి సెంటిమెంట్‌ను బ్రేక్ చేసిన ఎన్టీఆర్: SS కార్తికేయ

రాజమౌళితో సినిమా తీసిన తర్వాత హీరోల నెక్స్ట్ మూవీ ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్‌ను ఎన్టీఆర్ బ్రేక్ చేశారని జక్కన్న కుమారుడు SS కార్తికేయ పేర్కొన్నారు. ‘23 ఏళ్ల క్రితం ఎవరితో అయితే మొదలైందో ఆయనతోనే ఆ సెంటిమెంట్ బ్రేక్ అయింది. NTRను దగ్గరి నుంచి చూస్తూ పెరగడం, ఇప్పుడు ఆయన అద్భుతాలకు సాక్షులు కావడం ఎంతో ప్రత్యేకం. దేవర మాస్ అదిరిపోయింది. అభిమానులకు ఎన్టీఆర్ ఇచ్చిన బహుమతి ఇది’ అని తెలిపారు.
Similar News
News November 22, 2025
ఏపీలోనూ సర్పంచ్ ఎన్నికలు.. సన్నాహాలు షురూ!

TGలో స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు జరుగుతుండగా APలోనూ సన్నాహాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఓటర్ల జాబితాను SEC సేకరించినట్లు సమాచారం. ఇతర రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను తెప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను ఖరారుచేయగానే నోటిఫికేషన్ విడుదలచేసే ఛాన్స్ ఉంది. కాగా APలో 2021 FEB, APRలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి.
News November 22, 2025
ఈ-రేస్ కేసులో ఏసీబీ రిపోర్ట్.. నిందితులు వీరే

TG: ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ ఫైనల్ రిపోర్టు బయటికొచ్చింది. A1గా కేటీఆర్, A2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, A3గా బీఎల్ఎన్ రెడ్డి, A4గా కిరణ్ మల్లేశ్వరరావు, A5గా ఈ-రేస్ కంపెనీ FEO పేర్లను పొందుపరిచింది. 2024 డిసెంబర్ 19న కేసు నమోదవగా ఈ ఏడాది సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి నివేదిక పంపింది. కాగా ఈ కేసులో ఛార్జ్‌షీట్ నమోదుకు, కేటీఆర్ ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తూ గవర్నర్ ఇటీవల ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే.
News November 22, 2025
‘ఫ్రీ స్కూటీ స్కీమ్’.. PIBFactCheck క్లారిటీ

‘ప్రధానమంత్రి ఫ్రీ స్కూటీ స్కీమ్’ పేరుతో SMలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కాలేజీ విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇస్తారని వైరల్ అవుతున్న పోస్టులు ఫేక్ అని PIBFactCheck తేల్చింది. ప్రజలు ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సందర్శించాలని పేర్కొంది.


