News April 8, 2025

‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ ప్రీరిలీజ్‌కు NTR

image

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తోన్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ సినిమా ఈనెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా 12వ తేదీన ప్రీరిలీజ్ వేడుకను ఏర్పాటు చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ చీఫ్ గెస్ట్‌గా రానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, ఈ చిత్రంలో విజయశాంతి తల్లి పాత్రలో నటిస్తున్నారు.

Similar News

News April 17, 2025

ముర్షిదాబాద్ అల్లర్లపై సిట్ ఏర్పాటు

image

పశ్చిమబెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఇటీవల జరిగిన అల్లర్లపై రాష్ట్ర పోలీసులు 9మంది అధికారులతో సిట్ ఏర్పాటు చేశారు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా గత వారం అక్కడ జరిగిన ఆందోళనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హింసకు కారకులు, తదితరాలపై ప్రభుత్వానికి సిట్ నివేదిక అందించనుంది. మరోవైపు అల్లర్లలో మృతి చెందిన ముగ్గురి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల చొప్పున CM మమత నష్టపరిహారం ప్రకటించారు.

News April 17, 2025

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు A+ కాంట్రాక్ట్?

image

రోహిత్, కోహ్లీ, బుమ్రాకు BCCI A+ కాంట్రాక్ట్ కేటాయించనున్నట్లు సమాచారం. బోర్డు వర్గాల్ని ఉటంకిస్తూ స్పోర్ట్స్‌తక్ ఈ విషయాన్ని తెలిపింది. మూడు ఫార్మాట్లలోనూ ఆడుతున్న అగ్ర క్రికెటర్లకు మాత్రమే బోర్డు A+ గ్రేడ్ కేటాయిస్తోంది. రోహిత్, కోహ్లీ ఇప్పటికే టీ20లకు వీడ్కోలు పలికారు. వన్డేలు, టెస్టులు మాత్రమే ఆడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి A+ గ్రేడ్ దక్కుతుందా లేదా అన్న ఆసక్తి క్రికెట్ వర్గాల్లో నెలకొంది.

News April 17, 2025

వికసిత్ భారత్‌లో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకం: పవన్

image

AP: వికసిత్ భారత్ లక్ష్య సాధనలో గ్రామీణాంధ్రప్రదేశ్ పాత్ర కీలకమని Dy.CM పవన్‌ అన్నారు. పర్యావరణహితంగా గ్రామాల్లో ఆర్థిక వృద్ధికి కృషి చేస్తున్నామని, గ్రామీణ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పిస్తున్నట్లు చెప్పారు. పంచాయతీ వ్యవస్థ బలోపేతానికి ఆర్థిక సంఘం సాయం అవసరమని పేర్కొన్నారు. అంతకుముందు 16వ ఆర్థిక సంఘం సభ్యుల మీటింగ్‌‌లో పాల్గొన్నారు. 2 రోజులుగా జ్వరంతో ఉన్న ఆయన చేతికి కాన్యులాతోనే హాజరయ్యారు.

error: Content is protected !!