News March 4, 2025

“నాటు”ని బీట్ చేసేలా ఎన్టీఆర్-హృతిక్ డాన్స్?

image

వార్-2 మేకర్స్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్-హృతిక్ రోషన్‌లతో ఒక భారీ సాంగ్ షూటింగ్ ఇవాళ్టి నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వీరిద్దరి స్టెప్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయన్నారు. క్లైమాక్స్ ఫైట్‌కు ముందు వచ్చే ఈ పాటని 500 మందితో డ్యాన్సర్లతో నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ప్రీతమ్ మ్యూజిక్‌ అందించగా బాస్కో మార్టిస్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులో యంగ్ టైగర్ ‘RAW’ ఏజెంట్‌గా నటిస్తున్నారు.

Similar News

News March 4, 2025

ఆదోనికి పోసాని కృష్ణమురళి

image

AP: గుంటూరు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణమురళిని ఆదోని PSకు తరలిస్తున్నారు. అక్కడ ఆయనపై కేసు నమోదైన నేపథ్యంలో పీటీ వారెంట్ దాఖలు చేసి తీసుకెళ్తున్నారు. మరోవైపు, నరసరావుపేట కోర్టులో పోసాని బెయిల్ పిటిషన్ వేయగా దానిపై విచారణ ఎల్లుండికి వాయిదా పడింది. రాజంపేట జైలులో ఉన్న ఆయన్ను నిన్న పోలీసులు పీటీ వారంట్‌పై నరసరావుపేట తీసుకురాగా, జడ్జి 10 రోజులు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే.

News March 4, 2025

మైక్రోచిప్‌, ఓలా, స్టార్‌బక్స్‌లో వేలాది ఉద్యోగాల కోత

image

మైక్రోచిప్‌, ఓలా, స్టార్‌బక్స్‌ సంస్థలు భారీగా ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు ప్రకటించాయి. మైక్రోచిప్ 2వేలు, ఓలా ఎలక్ట్రిక్ 1000, స్టార్‌బక్స్ 1100, హెచ్‌పీ 2వేల ఉద్యోగాల్ని తొలగించనున్నాయి. ఖర్చు తగ్గింపులో భాగంగా కొలువుల్ని తగ్గిస్తున్నట్లు సంస్థలు వివరిస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లోపు లే ఆఫ్స్ పూర్తయ్యే అవకాశం ఉంది. దీంతో ఉద్యోగుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News March 4, 2025

సజ్జల బెయిల్ పిటిషన్.. విచారణ వాయిదా

image

AP: వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వివరాలు సమర్పించేందుకు ప్రభుత్వం సమయం కోరడంతో తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. పోసాని రిమాండ్ రిపోర్టు ఆధారంగా కేసు నమోదయ్యే అవకాశం ఉందంటూ బెయిల్ కోసం ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!