News September 25, 2024
యాంగ్రీ లుక్లో ఎన్టీఆర్.. ‘దేవర’ నయా పోస్టర్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. మరో రెండు రోజుల్లో ఈ సినిమా రిలీజ్ కానుండగా చిత్ర యూనిట్ కొత్త పోస్టర్ను ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ చేతిలో ఆయుధంతో యాంగ్రీ లుక్లో ఉన్నారు. ‘ఆయుధం రక్తం రుచి చూసింది. తర్వాతి వంతు ప్రపంచానిదే. మరో రెండు రోజుల్లో..’ అని రాసుకొచ్చింది.
Similar News
News November 23, 2025
1, 2, 3 ఇవి ర్యాంకులు కాదు.. కరీంనగర్ – జమ్మికుంట బస్సులు

కరీంనగర్ – అన్నారం – చల్లూర్ – వీణవంక – జమ్మికుంట రూట్లో బస్సుల రాకపోకలపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రతి అరగంటకు ఒక బస్సు వస్తున్నా, ఆ తర్వాత ఈ రూట్లో ఒక్కోసారి ఒకేసారి మూడు బస్సులు వస్తాయని, లేదంటే గంట, గంటన్నర వరకు బస్సులే ఉండవని ప్రయాణికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి, సమయపాలనను సరిచేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
News November 23, 2025
సామ్ కరన్ ఎంగేజ్మెంట్

ఇంగ్లండ్ క్రికెటర్ సామ్ కరన్ తన ప్రియురాలు ఇసాబెల్లా గ్రేస్ను పరిచయం చేశారు. ఆమెకు పెళ్లి ప్రపోజ్ చేస్తూ, ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. వీరు తొలిసారిగా 2018లో పరిచయమయ్యారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇసాబెల్లా 1998న ఇంగ్లండ్లో జన్మించారు. థియేటర్ ఆర్టిస్టుగా పని చేస్తున్నారు. అటు సామ్ కరన్ వచ్చే సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడనున్నారు.
News November 23, 2025
పిల్లలు బరువు తగ్గుతున్నారా?

పిల్లలు పుట్టినప్పుడు సరైన బరువుతో ఉన్నా ఆ తర్వాత బరువు తగ్గిపోతున్నారని చాలామంది పేరెంట్స్ వైద్యులను సంప్రదిస్తుంటారు. ఇది సాధారణమే అంటున్నారు నిపుణులు. పుట్టినప్పుటి బరువులో 6-7 శాతం వరకు తగ్గుతారట. డబ్బా పాలు తాగేవారిలో 3-4 శాతం తగ్గుదల కనిపిస్తుంది. చిన్నారులు పుట్టినప్పటి బరువుతో పోలిస్తే ఐదు నుంచి ఆరు నెలల తర్వాత రెట్టింపు బరువు పెరిగితే వారు ఆరోగ్యంగా ఉన్నట్లేనని చెబుతున్నారు.


