News February 12, 2026

NTR: KGBVలో కలకలం.. 11 మంది విద్యార్థినులకు ఎలుక కాటు!

image

ఏ.కొండూరులోని కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో గురువారం రాత్రి కలకలం రేగింది. పాఠశాలలో నిద్రిస్తున్న 11 మంది విద్యార్థినులను ఎలుకలు కరవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితులకు పాఠశాల లోపలే ప్రాథమిక చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకొని యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థినుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

Similar News

News March 15, 2026

నల్గొండ: ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

image

ఉమ్మడి NLG జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఆదివారం ఎన్నికైంది. అధ్యక్షుడిగా MLA వేముల వీరేశం, ప్రధాన కార్యదర్శిగా గొట్టిపాటి కర్తయ్య, కోశాధికారిగా ఇమామ్ కరీం ఎన్నికయ్యారు. 2030 వరకు నాలుగేళ్ల పాటు ఈ కమిటీ బాధ్యతల్లో కొనసాగుతుందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యేక కృషి చేస్తామని MLA తెలిపారు.

News March 15, 2026

పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై చంద్రబాబు ఆగ్రహం

image

AP: TDP MP పుట్టా మహేశ్ డ్రగ్స్ వ్యవహారంపై CM చంద్రబాబు సీరియస్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. ఘటనపై వివరణ కోరుతూ మహేశ్‌కు నోటీసులు ఇవ్వాలని, పూర్తి నివేదిక తనకు సమర్పించాలని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు పల్లా శ్రీనివాస్‌కు సూచించారు. డ్రగ్స్ కేసుల్లో ఎవరున్నా ఉపేక్షించేది లేదని CBN స్పష్టం చేశారు. నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని తేల్చిచెప్పారు.

News March 15, 2026

ANU: సజావుగా దూరవిద్య ఉమ్మడి ప్రవేశ పరీక్ష

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దూరవిద్య కేంద్రం ఆధ్వర్యంలో MBA, MCA ప్రవేశ పరీక్ష ఆదివారం సజావుగా జరిగినట్లు CDE వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. ANUలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 కేంద్రాలలో 736 మంది విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకొని 670 మంది పరీక్షకు హాజరైనట్లు చెప్పారు. ఈ నెల 17న సాయంత్రం ఫలితాలను విడుదల చేస్తామన్నారు.