News September 11, 2025
NTR: MBA పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో జనవరి 2025లో నిర్వహించిన MBA( హాస్పిటల్ మేనేజ్మెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్) 1,3వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల రీవాల్యుయెషన్ ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌లో తమ రిజిస్టర్ నంబర్ ద్వారా రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. ఫలితాలకై https://www.nagarjunauniversity.ac.in/ చూడాలని ANU పరీక్షల విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.
Similar News
News September 11, 2025
గ్రామాభివృద్ధికి మాస్టర్ ప్లాన్ చేయండి: చిన్నారెడ్డి

గ్రామాల్లో జరుగుతున్న, జరగబోయే అభివృద్ధి పనులకు సంబంధించి మాస్టర్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి సూచించారు. బుధవారం మహబూబ్‌నగర్ కలెక్టరేట్ సమావేశపు హాలులో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్ వ్యవస్థ పురాతనమైందని, గ్రామాల అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నేరుగా నిధులు వచ్చేలా అప్పట్లో రాజీవ్ గాంధీ రూపొందించారని గుర్తు చేశారు.
News September 11, 2025
ఖమ్మంలో ఈ నెల 12న జాబ్ మేళా…!

ఖమ్మం టేకులపల్లి ఐటీఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 12న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి శ్రీరామ్ తెలిపారు. HYD అపోలో ఫార్మసీలో ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహిస్తున్నామన్నారు. D/B పార్మసీ, ఎస్ఎస్సీ ఆపైన విద్యార్హత కలిగి, 18 నుంచి 35 సం.రాలు కలిగిన వారు అర్హులన్నారు. ఆసక్తిగల వారు విద్యార్హత పత్రాలతో జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.
News September 11, 2025
కామారెడ్డి: హైవేపై 26 గొర్రెలు మృతి

కామారెడ్డి మండలంలోని 44వ జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతి చెందిన వ్యక్తి నారాయణపేట జిల్లా మరికల్‌కు చెందిన గుడికండ్ల రామప్పగా, గాయపడిన మరో గొర్రెల కాపరి బసాయిల మల్లేష్‌గా పోలీసులు గుర్తించారు. ప్రమాదంలో 26 గొర్రెలు మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ వెల్లడించారు. గొర్రెలకు పశుగ్రాసం నిమిత్తం ఇక్కడికి వచ్చి మృత్యువాత పడ్డారు.