News August 17, 2024
యథావిధిగా ఎన్టీఆర్ వైద్య సేవలు: నెట్‌వర్క్ ఆస్పత్రుల సంఘం

AP: రాష్ట్రంలోని నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు యథావిధిగా కొనసాగుతాయని ఆస్పత్రుల సంఘం వెల్లడించింది. సంఘం నేతలు ఇవాళ మంత్రి సత్యకుమార్‌తో భేటీ అయ్యారు. తమ సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారని, రూ.500కోట్ల పెండింగ్ బకాయిలు సోమవారం విడుదల చేస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. వచ్చే నెలాఖరు నాటికి మరో రూ.250కోట్లు విడుదల చేయాలని మంత్రిని కోరినట్లు తెలిపారు.
Similar News
News February 4, 2026
‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్ అప్‌డేట్

వచ్చే ఏడాది జూన్ లేదా జులైలో ‘యానిమల్ పార్క్’ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తామని డైరెక్టర్ సందీప్ వంగా వెల్లడించారు. ఒకే విధంగా కనిపించే ఇద్దరు బ్రదర్స్ మధ్య జరిగే వార్‌ను ఇందులో చూపెట్టబోతున్నట్లు చెప్పారు. రన్ విజయ్, అజీజ్ పాత్రల మధ్య జరిగే ఘర్షణే ఈ సినిమా అని పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం సందీప్ ‘స్పిరిట్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. అటు రణ్‌బీర్ ‘రామాయణ’, ‘లవ్&వార్’ సినిమాలు చేస్తున్నారు.
News February 4, 2026
మార్చిలోపు దివ్యాంగ పోస్టుల భర్తీ: మంత్రి

AP: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దివ్యాంగ బ్యాక్‌లాగ్ పోస్టులను మార్చిలోపు భర్తీ చేయాలని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ఆదేశించారు. అదే విధంగా గ్రామ, వార్డు సచివాలయాల పర్యవేక్షణకు జిల్లాకో అధికారిని నియమించాలని సూచించారు. ఉద్యోగులందరికీ పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. వెలగపూడి సచివాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
News February 4, 2026
చిక్కుల్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం

ఆర్మీ మాజీ చీఫ్ నరవణె రాసిన ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటివరకూ పబ్లిష్ కాని ఈ బుక్ కాపీ రాహుల్ గాంధీ చేతిలో కనిపించడంతో వివాదం మరింత ముదిరింది. చైనాతో ఉద్రిక్తతలపై ఇందులో రాశారని రాహుల్ ఆరోపిస్తున్నారు. ప్రచురించని పుస్తకంలో ఉన్న వాటిని లేవనెత్తడం దేశ భద్రతకు ముప్పని కేంద్రం అంటోంది. రక్షణ శాఖ అనుమతులు రాకపోవడంతో 2023 నుంచి ఇది ప్రచురణ కాలేదు.


