News February 25, 2025

NTR : MLC ఎన్నికలు.. పరీక్షలు వాయిదా

image

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ఈ నెల 27న ఉన్నందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో 27న జరగాల్సిన ఎంటెక్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను మార్చి 3వ తేదికి వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

Similar News

News February 25, 2025

మల్లాపూర్: పచ్చదనం నింపుకున్న చెట్టు

image

జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం నడికుడ గ్రామంలోని ఒక చెట్టు నిండుగా ఆకుపచ్చ ఆకులతో మనసుని ఆకట్టుకుంటుంది. కొత్తగా ఆకులు చిగురించడంతో చెట్టు మొత్తం పచ్చని ఆకులతో వత్తుగా పెరగడంతో, పచ్చదనంతో చూడగానే మనసుని ఆకర్షించేలా కనిపిస్తుంది. ఈ అరుదైన దృశ్యం కెమెరాకి మంగళవారం చిక్కింది. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి.

News February 25, 2025

రాహుల్ గాంధీతో శశిథరూర్‌కు పడటం లేదా!

image

అధిష్ఠానంతో కాంగ్రెస్ MP శశిథరూర్‌కు పొసగడం లేదా? BJP, మోదీ, LDFపై ఆయన స్వేచ్ఛగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం రాహుల్, సోనియాకు నచ్చడం లేదా? ఈ విభేదాలు ఇప్పుడు మరింత ముదిరాయా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు. ‘నా అవసరం మీకు లేకుంటే నాకు ఆప్షన్స్ ఉన్నాయి’ అని థరూర్ స్పష్టం చేయడాన్ని ఉదహరిస్తున్నారు. దీన్నిబట్టి రాబోయే రోజుల్లో కేరళ రాజకీయాలు రసవత్తరంగా మారొచ్చని అంటున్నారు. దీనిపై మీ కామెంట్.

News February 25, 2025

దుద్యాల్: లగచర్ల రైతులు ఇండస్ట్రియల్ పార్కుకు సహకరిస్తున్నారు: కలెక్టర్

image

లగచర్ల రైతులు స్వచ్ఛందంగా ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి సహకరిస్తున్నారని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ దుద్యాల మండలం లగచర్ల ఇండస్ట్రియల్‌కు సంబంధించి తమ భూమి స్వచ్ఛందంగా ఇచ్చిన 22 మంది రైతులకు చెక్కులు పంపిణి చేశారు. భూములు ఇస్తున్న రైతులకు నష్టపరిహారాలు అందించి ప్రభుత్వం తరఫున ప్రోత్సహిస్తామని ఆయన తెలిపారు.

error: Content is protected !!