News February 25, 2025
NTR : MLC ఎన్నికలు.. పరీక్షలు వాయిదా

ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ MLC ఎన్నికలు ఈ నెల 27న ఉన్నందున ఆ రోజు జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ తెలిపింది. ఈ మేరకు కృష్ణా యూనివర్సిటీ పరిధిలోని కాలేజీలలో 27న జరగాల్సిన ఎంటెక్ ఒకటో సెమిస్టర్ రెగ్యులర్ & సప్లిమెంటరీ పరీక్షలను మార్చి 3వ తేదికి వాయిదా వేశామని కృష్ణా యూనివర్సిటీ పరీక్షల విభాగం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.
Similar News
News February 25, 2025
JAN-2025లో మోస్ట్ విజిటెడ్ వెబ్‌సైట్స్ ఇవే

1. గూగుల్ – 9.6 బిలియన్
2. యూట్యూబ్ – 5.1B
3. ఇన్‌స్టాగ్రామ్ – 919మిలియన్లు
4. ఫేస్‌బుక్ – 681M
5. వాట్సాప్ – 511M
6. chatgpt – 452M
7. అమెజాన్ – 388M
8. Bing – 294M
9. వికీపీడియా – 279M
News February 25, 2025
వీసీలకు బెదిరింపులంటూ వైసీపీ ‘ట్రూత్ బాంబ్’ పోస్ట్

AP: వీసీలను బెదిరించి రాజీనామా చేయించారని మండలిలో YCP నేతలు ఆరోపించారు. ఆధారాలుంటే చూపాలని మంత్రి లోకేశ్ సవాల్ విసరగా YCP స్పందించింది. ఛైర్మన్ మౌఖికంగా ఆదేశించడంతో తాను రాజీనామా చేస్తున్నట్లు సింహపురి వర్సిటీ VC సుందరవల్లి రాసిన లేఖను Xలో పోస్టు చేసింది. ‘ఇదిగో ఆధారాలు బయటపెట్టాం. నిజాయితీ ఉంటే VCల రిజైన్‌పై న్యాయబద్ధ విచారణ చేయించాలి. లేదంటే లోకేశ్ రాజీనామా చేయాలి’ అని డిమాండ్ చేసింది.
News February 25, 2025
కోయ భాషలో పెళ్లి పత్రిక.. వైరల్

తమ మాతృ భాష ‘కోయ’పై ఉన్న ప్రేమను ఓ జంట వినూత్నంగా చాటింది. పెళ్లి శుభలేఖను కోయ భాషలో ముద్రించిన ఫొటో వైరలవుతోంది. పెళ్లి పిలుపును జోడ, వరుడిని పేకల్, వధువును కోకాడ్, భోజనాన్ని పెళ్లి బంతి అని అందులో పేర్కొన్నారు. అలాగే ప్రాంతాల, వ్యక్తుల పేర్లు మినహా పత్రిక అంతా కోయ భాషలోనే ఉండటం విశేషం.