News April 9, 2025

ఎన్టీఆర్-నీల్ మూవీ అప్డేట్‌ వచ్చేసింది

image

యంగ్‌టైగర్ ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న ఓ భారీ ప్రాజెక్ట్ నుంచి అప్డేట్‌ వచ్చింది. ఈ నెల 22 నుంచి ఎన్టీఆర్ షూటింగ్‌లో పాల్గొంటారని మూవీ మేకర్స్ తెలిపారు. ఈ క్రేజీ అప్డేట్‌తో తారక్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Similar News

News November 3, 2025

రేపు పిడుగులతో వర్షాలు: APSDMA

image

AP: రేపు పలు జిల్లాలకు APSDMA వర్షసూచన చేసింది. కోనసీమ, తూ.గో., ప.గో., కృష్ణా, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వానలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. అకస్మాత్తుగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసేటప్పుడు చెట్ల కింద నిలబడరాదని సూచించింది.

News November 3, 2025

Photo: అప్పుడు ధోనీ.. ఇప్పుడు హర్మన్

image

భారత మహిళా జట్టు తొలిసారి <<18182320>>ప్రపంచకప్<<>> గెలిచి దశాబ్దాల నాటి కలను సాకారం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముంబైలోని ఐకానిక్ గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద ట్రోఫీతో కెప్టెన్ హర్మన్ ప్రీత్ ఫొటోలకు పోజులిచ్చారు. 2011 నాటి ధోనీ పోజ్‌ను రీక్రియేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ICC ట్వీట్ చేసింది. అంతకుముందు ‘క్రికెట్ అందరి గేమ్’ అని రాసిన టీషర్ట్‌ ధరించి, కప్‌తో నిద్రిస్తున్న ఫొటోను హర్మన్ షేర్ చేశారు.

News November 3, 2025

ఆన్‌లైన్‌లో గేమ్స్ ఆడి అప్పుల పాలు.. కానిస్టేబుల్ ఆత్మహత్య!

image

TG: పోలీస్ కానిస్టేబుల్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డిలో జరిగింది. కల్హేర్‌కు చెందిన సందీప్ ఏడాదికాలంగా పట్టణ PSలో పనిచేస్తున్నారు. ఈరోజు మహబూబ్‌సాగర్ చెరువు కట్టపై రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన ఆన్‌లైన్‌ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నారని, సహోద్యోగుల వద్ద అప్పులు చేశారని సమాచారం. డబ్బులు తిరిగివ్వాలని ఒత్తిడి చేయడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.