News October 30, 2024
NOV చివర్లో సెట్స్పైకి ఎన్టీఆర్-నీల్ మూవీ?

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో జూనియర్ ఎన్టీఆర్ నటించనున్న మూవీపై ఓ క్రేజీ న్యూస్ వైరలవుతోంది. నవంబర్ చివరి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం. తొలుత యంగ్ టైగర్ లేని సన్నివేశాలను చిత్రీకరిస్తారని తెలుస్తోంది. వార్-2 షూటింగ్ ముగిసిన తర్వాత జనవరి లాస్ట్ వీక్లో నీల్ ప్రాజెక్టులోకి ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి.
Similar News
News November 21, 2025
NGKL: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని వినతి

జిల్లాలో పని చేస్తున్న జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలని TWJF జర్నలిస్ట్ యూనియన్ నాయకులు కోరారు. ఎంపీ డాక్టర్ మల్లు రవి, కలెక్టర్ బాదావత్ సంతోష్లకు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. పెండింగ్లో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా నాయకులు పాల్గొన్నారు.
News November 21, 2025
పిల్లల్ని కనేందుకు సరైన వయసు ఇదే: వైద్యులు

పిల్లల్ని కనడానికి ఏ వయసు ఉత్తమమో వైద్యులు సూచించారు. ‘ఆరోగ్యకరమైన గర్భధారణ, బిడ్డ కోసం స్త్రీల ఏజ్ 20-30 మధ్య ఉండాలి. 35 తర్వాత గర్భధారణ డౌన్ సిండ్రోమ్, బీపీ, డయాబెటిస్ వంటి సమస్యలు పెరుగుతాయి. పురుషులకు 25-35 ఏళ్లు ఉత్తమం. 40ఏళ్ల తర్వాత పుట్టేబిడ్డల్లో ఆటిజం, జన్యు సమస్యల ప్రమాదం పెరుగుతుంది. తల్లిదండ్రుల ఏజ్ 35 కంటే తక్కువ ఉన్నప్పుడే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి’ అని చెబుతున్నారు.
News November 21, 2025
రైతుల ఆత్మహత్యాయత్నం.. మీ హామీ ఏమైంది రేవంత్: హరీశ్ రావు

TG: భూములు రిజిస్ట్రేషన్ కావడం లేదని MLA క్యాంపు/తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతులు ఆత్మహత్యాయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ట్వీట్ చేశారు. ‘అధికారంలోకి వస్తే 3 నెలల్లో భూ సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ ఏమైంది రేవంత్? మీ ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ రైతుల జీవితాలతో ఆడుకుంటోంది. భూములపై రైతులకు హక్కు లేకుండా చేస్తోంది. 70వేల పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి’ అని డిమాండ్ చేశారు.


