News May 20, 2024
ఆగస్టు నుంచి ఎన్టీఆర్-నీల్ మూవీ షూటింగ్

జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమాపై ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ పోస్టర్ను విడుదల చేసింది. సలార్, KGF వంటి బ్లాక్బస్టర్ సినిమాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తారక్ బర్త్ డే సందర్భంగా ఆయనకు విషెస్ తెలుపుతూ ప్రత్యేక పోస్టర్ను రిలీజ్ చేసింది.
Similar News
News November 21, 2025
25న తెలంగాణ క్యాబినెట్ భేటీ.. ఎన్నికలే అజెండా!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ ఈ నెల 25న భేటీ కానుంది. పంచాయతీ ఎన్నికలే అజెండాగా మంత్రివర్గం సమావేశం కానున్నట్లు సమాచారం. ఎలక్షన్స్ నోటిఫికేషన్, పోలింగ్ తేదీలపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా వచ్చే నెల 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని ఇప్పటికే ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. మొదట సర్పంచ్, తర్వాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్.. ఏపీకి వర్ష సూచన

ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం ఏర్పడనున్న అల్పపీడనం బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దీనికి ‘సెన్యార్’గా పేరు పెట్టారు. ఈ తుఫాను ప్రభావంతో ఈ నెల 26 నుంచి 29 వరకు ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో వర్షం కురుస్తోంది. ప్రకాశం, NLR, CTR, TPT, కృష్ణా, బాపట్ల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
News November 21, 2025
‘సెన్యార్’ తుఫాన్ – రైతులకు సూచనలు

‘సెన్యార్’ తుఫాన్ వల్ల ఈ నెల 26 నుంచి 29 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఈ తరుణంలో రైతులు ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి తూకం వేసిన వాటిని వెంటనే రైస్ మిల్లులకు తరలించడం మంచిది. ఆరబోసేందుకు ఉన్న ధాన్యాన్ని కుప్పలుగా చేసి టార్పాలిన్ కవర్లతో కప్పి ఉంచితే వర్షానికి తడవకుండా ఉంటుంది.


