News January 16, 2025

సైఫ్‌పై కత్తితో దాడి.. స్పందించిన ఎన్టీఆర్

image

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్‌పై జరిగిన <<15167744>>దాడిపై<<>> యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘సైఫ్‌పై జరిగిన దాడి గురించి విని షాక్‌కు గురయ్యా. ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నా’ అని ట్వీట్ చేశారు. దీనిపై ‘దేవర’ టీమ్ సైతం స్పందిస్తూ.. ‘ఇది తెలుసుకొని దిగ్భ్రాంతికి గురయ్యాం. త్వరగా కోలుకోండి సైఫ్ సార్’ అని పేర్కొంది.

Similar News

News January 31, 2026

నేటితో ముగియనున్న ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు

image

AP: రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 19 నుంచి ప్రారంభమైన ఉచిత పశు ఆరోగ్య శిబిరాల కార్యక్రమం నేటితో ముగియనుంది. 13,257 గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి పశు వైద్య చికిత్సలు, నట్టల నివారణ మందులు, వ్యాధి నిరోధక టీకాలను అందించడం, వ్యాధి నిర్ధారణ పరీక్షలను నిర్వహిస్తున్నారు. పాడిరైతులకు పశు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికీ పశువులకు టీకాలు వేయించకుంటే ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి.

News January 31, 2026

ధనవంతులు కావాలంటే..?

image

ధనవంతులు కావాలనే తపన అందరిలో ఉంటుంది. కానీ అందుకు అదృష్టం కూడా తోడవాలి. ఆధ్యాత్మికంగా ధనాకర్షణ పెరగాలంటే తోటివారికి సాయం చేయడం, దానం చేయడం ఉత్తమం. పర్సులో ఎప్పుడూ కొంత నగదు ఉంచుకోవడం, దగ్గర డబ్బులు పెట్టడం వల్ల సంపద శక్తి పెరుగుతుంది. సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సానుకూలత లభిస్తుంది. అయితే, ఈ మార్గాలన్నీ ఇంజిన్‌కు పెట్రోల్ వంటివి మాత్రమే. లక్ష్యాన్ని చేరడానికి మీ నిరంతర కృషే అసలైన వాహనం.

News January 31, 2026

బిల్ గేట్స్‌కు సెక్సువల్ డిసీజ్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో సంచలనం

image

బిల్ గేట్స్ గురించి <<19008385>>ఎప్‌స్టీన్ ఫైల్స్<<>> తాజాగా షాకింగ్ విషయాన్ని వెల్లడించాయి. రష్యన్ యువతులతో గడిపిన తర్వాత ఆయనకు సెక్సువల్ డిసీజ్ సోకిందని ఎప్‌స్టీన్ రాసుకున్న మెయిల్స్ ద్వారా తెలుస్తోంది. ఆ విషయాన్ని దాచిపెట్టి భార్య మెలిందాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని యత్నించారని పేర్కొన్నాయి. ఈ ఆరోపణలను బిల్ గేట్స్ ఖండించారు. తనను బ్లాక్ మెయిల్ చేయడానికే ఎప్‌స్టీన్ ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేశాడని చెప్పారు.