News March 23, 2024
‘దేవర’లో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ మూవీ గురించి ఓ క్రేజీ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకూ డ్యూయల్ రోల్ అనుకున్న ఫ్యాన్స్‌కు ఇది మంచి ట్రీట్ అనే చెప్పుకోవాలి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. శృతి మరాఠే కీలక పాత్ర పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
Similar News
News April 8, 2025
రేపు ఎన్టీఆర్-నీల్ సినిమా అప్డేట్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా నుంచి రేపు కొత్త అప్డేట్ రానుంది. రేపు మ.12.06 గంటలకు ప్రకటన ఉంటుందని మేకర్స్ తెలిపారు. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీని రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీకి ‘డ్రాగన్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
News April 8, 2025
సీఎం ఛైర్మన్‌గా జలహారతి కార్పొరేషన్

AP: పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు కోసం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. వైస్ ఛైర్మన్‌గా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, సీఈఓగా జలవనరుల శాఖ ప్రధాన కార్యదర్శి ఉండనున్నారు. పోలవరం వరద నీరు తరలించేందుకు బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు రూ. 80వేల కోట్లకు పైగా ఖర్చవుతుండగా, 3లక్షల హెక్టార్లు సాగులోకి వస్తాయని ప్రభుత్వ అంచనా.
News April 8, 2025
థ్రిల్లింగ్ మ్యాచ్: KKRపై LSG విజయం

కేకేఆర్‌తో జరిగిన మ్యాచులో లక్నో విజయం సాధించింది. 239 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన కేకేఆర్ 234 పరుగులు చేసింది. దీంతో LSG 4 పరుగుల తేడాతో గెలిచింది. కేకేఆర్‌లో రహానే (61), వెంకటేశ్ (45) రాణించారు. చివర్లో రింకూ పోరాడినా ఫలితం లేకుండా పోయింది. లక్నో బౌలర్లలో ఆకాశ్, శార్దూల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేశ్, దిగ్వేశ్, బిష్ణోయ్ తలో వికెట్ తీశారు.