News September 16, 2024
దేవరలో ఎన్టీఆర్ ట్రిపుల్ రోల్?
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటించినట్లు తెలుస్తోంది. సినిమాలో మూడో పాత్ర చుట్టే కథ తిరుగుతుందని సమాచారం. కొరటాల శివ తెరకెక్కించిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించారు. సైఫ్ అలీఖాన్ కీలక పాత్ర పోషించారు. అనిరుధ్ సంగీతం అందించారు. ఈ నెల 27న వరల్డ్ వైడ్గా మూవీ విడుదల కానుంది.
Similar News
News December 21, 2024
మరికొన్ని గంటల్లో అద్భుతం
ఈరోజు ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఎప్పటిలా కాకుండా ఈరోజు ముందుగానే రాత్రి కానుంది. భూభ్రమణంలో భాగంగా సూర్యుడి చుట్టూ భూమి తిరిగే కక్ష్య దూరం పెరిగి 16గంటల సుదీర్ఘ రాత్రి ఉండనుంది. ఈరోజు ఉదయం 7.10గంటలకు సూర్యుడు ఉదయించగా సూర్యకాంతి దాదాపు 8 గంటలే ఉండనుంది. ఇలా సుదీర్ఘ రాత్రి ఏర్పడే రోజు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
News December 21, 2024
పులివెందుల MLAకు జన్మదిన శుభాకాంక్షలు: నాగబాబు
AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్కు జనసేన నేత నాగబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల MLA జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఇలాగే పదికాలాల పాటు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’ అని ‘X’లో పోస్ట్ చేశారు. జగన్కు సీఎం చంద్రబాబు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన విషయం తెలిసిందే.
News December 21, 2024
నా సహచరులు విధిలేక బీఆర్ఎస్లో ఉన్నారు: సీఎం రేవంత్
కొంతమంది నేతలు విధిలేక BRSలో కొనసాగుతున్నారని CM రేవంత్ అన్నారు. ‘BRSలోనూ రాష్ట్రం కోసం ఆలోచించే కొంతమంది ఉన్నారు. విధిలేని పరిస్థితుల్లో, రాజకీయ కారణాలతో వేరే దారిలేక ఆ పార్టీలో కొనసాగుతున్నారు. వారు హైదరాబాద్లోనే పుట్టి పెరిగారు. నగరం అభివృద్ధి చెందితే వారి గౌరవం పెరుగుతుంది. ఆ నేతలకు చెబుతున్నా. BRS వారితో సావాసం చేయకండి. వాళ్లు తెలంగాణ సమాజం కోసం పనిచేసే రకాలు కాదు’ అని పేర్కొన్నారు.