News August 16, 2025
‘వార్-2’ రెస్పాన్స్‌పై NTR ట్వీట్

‘వార్-2’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ‘మేము చాలా ప్యాషన్‌తో తీసిన సినిమాకు ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన రాసుకొచ్చారు. కాగా అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ‘వార్-2’ రెండు రోజుల్లో రూ.150కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించిందని సినీవర్గాలు తెలిపాయి.
Similar News
News August 16, 2025
రేపు ఈసీ ప్రెస్ మీట్.. రీజన్ అదేనా?

భారత ఎన్నికల సంఘం రేపు న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించనుంది. ‘ఓట్ చోరీ’ అంటూ పలుమార్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేయడంతో ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కర్ణాటక, మహారాష్ట్రలో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని, ఈ కారణంగానే పలు చోట్ల కాంగ్రెస్ నేతలు ఓడారని ఆయన ఆరోపించారు.
News August 16, 2025
‘OG’లో కన్మని ఎవరంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ తెరకెక్కిస్తోన్న ‘OG’ సినిమాలో నటిస్తోన్న ప్రియాంకా మోహన్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు. ఆమె కన్మని పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు. అతి త్వరలోనే సెకండ్ సింగిల్ ప్రోమోను విడుదల చేస్తామని తెలిపారు. కాగా ఇప్పటికే రిలీజైన ఫస్ట్ సింగిల్ అదరగొట్టిన విషయం తెలిసిందే.
News August 16, 2025
మరో సరోగసీ దందా.. గిరిజన మహిళలే టార్గెట్!

TG: మేడ్చల్‌లో మరో సరోగసీ దందా వెలుగులోకి రాగా నిందితులైన తల్లీకొడుకులు లక్ష్మి, నరేందర్ <<17420803>>అరెస్ట్<<>> అయిన విషయం తెలిసిందే. దర్యాప్తులో ‘6 ఫెర్టిలిటీ కేంద్రాలతో లక్ష్మికి 20 ఏళ్లుగా సంబంధాలున్నాయి. పదిసార్లకు పైగా ఎగ్ డొనేట్ చేశారు. 2సార్లు సరోగెంట్‌గా ఉంది. రాజమండ్రి, రంపచోడవరం గిరిజన మహిళలను టార్గెట్ చేసి వారితో ఎగ్ డొనేట్ చేయించి రూ.30వేలు ఇచ్చారు’ అని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.