News October 9, 2025

NTR: ‘VRAల సమస్యలు తక్షణమే పరిష్కరించండి’

image

VRAల సమస్యల పరిష్కారానికి జిల్లా సహాధ్యక్షుడు మధుబాబు, ట్రెజరర్ పరదేశీ గురువారం కలెక్టర్ లక్ష్మీశాకు వినతిపత్రం అందజేశారు. అర్హులైన VRAలకు సీనియారిటీ జాబితా ప్రకటించి అటెండర్, వాచ్మెన్, డ్రైవర్లు, రికార్డు అసిస్టెంట్ ప్రమోషన్లు కల్పించాలని కోరారు. రూ.10,500 జీతంతో కుటుంబ పోషణ భారంగా ఉండటం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో సహకారం అందిస్తున్నామని తెలిపారు.

Similar News

News October 10, 2025

కరీంనగర్: రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలం: గంగుల

image

బీసీ రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందని బీఆర్‌ఎస్ నేతలు గంగుల కమలాకర్, సుంకే రవిశంకర్ తీవ్ర విమర్శలు చేశారు. 42% రిజర్వేషన్‌పై హైకోర్టు స్టే విధించడం కాంగ్రెస్ చేసిన కోర్టు డ్రామా అని ఆరోపించారు. పిటిషనర్ల తరఫున ఫీజు కట్టి, బీసీలను మోసం చేస్తోందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు పూర్తి మద్దతు ఇచ్చినా రిజర్వేషన్లు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైందన్నారు.

News October 10, 2025

సంగారెడ్డి: ‘అర్థమయ్యేలా పుస్తకాలు రూపొందించడం అభినందనీయం’

image

విద్యార్థులకు అర్థమయ్యేలా సులభంగా పుస్తకాలు రూపొందించడం అభినందనీయమని సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రవీణ అన్నారు. రాజనీతి శాస్త్ర అధ్యాపకురాలు జోష్ణ, కంప్యూటర్ అప్లికేషన్ అధ్యాపకులు నాగప్రసాద్ రూపొందించిన పుస్తకాలను గురువారం ఆమె ఆవిష్కరించారు. ఈ పుస్తకాలు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయని ప్రిన్సిపల్ పేర్కొన్నారు.

News October 10, 2025

జూబ్లీహిల్స్‌ : ఓపెన్‌ వర్సిటీలో నేడు ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌

image

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ క్యాంపస్‌లో స్టైఫండ్‌ బేస్డ్‌ అప్రెంటీస్‌షిప్‌ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులక ఈ-ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్‌ డా.ఎల్వీకే రెడ్డి తెలిపారు. ఈ డ్రైవ్‌లో 8 ప్రముఖ రిటైల్‌ సంస్థలు పాల్గొంటున్నాయన్నారు. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ ఉ.10 గంటలు నుంచి సీఎస్‌టీడీ భవనంలో ప్రారంభమవుతుందని తెలిపారు.