News August 31, 2024
బాలయ్య గోల్డెన్ జూబ్లీ వేడుకలకు ఎన్టీఆర్ రావట్లేదా?
సినీనటుడు బాలకృష్ణ 50 ఏళ్ల సినీ ప్రస్థానం వేడుకలు రేపు జరగనున్నాయి. ఈ ఈవెంట్‌కు చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, అల్లు అర్జున్, రామ్‌చరణ్, సిద్ధు జొన్నలగడ్డ, విజయ్ దేవరకొండ, విశ్వక్ సేన్ వంటి స్టార్లు రానున్నారు. కానీ ఎన్టీఆర్ రాకపై మాత్రం స్పష్టత లేదు. ఆయనకు ఆహ్వానం అందలేదని కొందరు, అందినా రారని మరికొందరు అంటున్నారు. Sr.ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకూ ఆయన హాజరు కాలేదని కొందరు గుర్తు చేస్తున్నారు.
Similar News
News February 1, 2025
కాంగ్రెస్ MLAల రహస్య సమావేశం?
TG: 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రహస్య సమావేశం నిర్వహించినట్లు తెలుస్తోంది. తమ పనులు కాకపోవడంపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్ సమీపంలోని ఓ ఎమ్మెల్యే ఫామ్‌హౌస్‌లో వీరు భేటీ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రధానంగా టాప్-5లో ఉన్న ఓ మంత్రి వైఖరిపై వారు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం గాంధీభవన్‌లో హాట్‌టాపిక్‌గా మారింది.
News February 1, 2025
బడ్జెట్: నిర్మలా సీతారామన్ చీర ప్రత్యేకత ఇదే
బిహార్ రాష్ట్రానికి చెందిన మధుబని ఆర్ట్, పద్మ అవార్డు గ్రహీత దులారి దేవి కళకు గౌరవ సూచకంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ చీరను ధరించారు. గతంలో మిథిలా ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్‌లో క్రెడిట్ ఔట్‌రీచ్ యాక్టివిటీ కోసం వెళ్లినప్పుడు దులారి దేవిని నిర్మల కలిశారు. మధుబని ఆర్ట్ గురించి చర్చించారు. ఈ సందర్భంగా దులారి దేవి ఈ చీరను బహూకరించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పుడు ధరించాలని కోరారు.
News February 1, 2025
దారుణం.. తల్లి మృతదేహంతో తొమ్మిది రోజులు!
TG: తల్లి మృతదేహం పక్కనే డిప్రెషన్‌తో ఇద్దరు కూతుళ్లు 9రోజులు గడిపారు. HYDలోని బౌద్ధనగర్‌కు చెందిన రాజు, లలిత(45)కు రవళిక, అశ్విత ఇద్దరు కుమార్తెలు. 4ఏళ్ల క్రితం వీరిని వదిలేసి రాజు ఎక్కడికో వెళ్లాడు. ఈ క్రమంలో లలిత గుండెపోటుతో మరణించారు. అంతిమ సంస్కారాలకు డబ్బులు లేక కూతుళ్లు కూడా చనిపోవాలనుకున్నారు. ఆ ప్రయత్నం విఫలమవడంతో నిన్న బాహ్య ప్రపంచానికి తెలిపారు. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.