News April 2, 2025
NTR: అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ఎన్టఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈనెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలన్నారు.
Similar News
News April 4, 2025
గజపతినగరం: చెట్టు పైనుంచి జారిపడి ఒకరి మృతి

గజపతినగరం మండలంలో తాటి చెట్టు పైనుంచి జారిపడి ఒకరు మృతి చెందారు. ఎం.కొత్తవలస గ్రామానికి చెందిన భోగాది సత్యం (50) కల్లు తీసేందుకు తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పైనుంచి జారిపడి మృతి చెందినట్లు సత్యం భార్య భోగాది లక్ష్మి శుక్రవారం తెలిపారు. గజపతినగరం ఎస్సై లక్ష్మణరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ పెద్ద చనిపోవడంతో కుటుంబం రోడ్డున పడిందని లక్ష్మీ వాపోయారు.
News April 4, 2025
అవి తప్పుడు వార్తలు.. మేం విప్ జారీ చేశాం: వైసీపీ

AP: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుపై ఓటింగ్ సందర్భంగా వైసీపీ తమ ఎంపీలకు విప్ జారీ చేయలేదని వస్తున్న వార్తలను ఆ పార్టీ ఖండించింది. అది పూర్తిగా తప్పుడు ప్రచారం అని, తాము అధికారికంగా విప్ జారీ చేశామని ట్వీట్ చేసింది. కొందరు రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తాము సెక్యులర్ విలువలకు కట్టుబడి ఉన్నామని వైసీపీ స్పష్టం చేసింది.
News April 4, 2025
రాయచోటి : వాహనంపై స్టంట్ చేసిన యువకులపై కేసు

రాయచోటిలో స్కూటీపై వేగంగా, నిర్లక్ష్యంగా స్టంట్‌లు చేసిన ఇద్దరి యువకులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ లేని కారణంగా వారికి వాహనం ఇచ్చిన యజమానిపైనా కేసు నమోదైంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు ఎవరూ బైక్స్ ఇవ్వొద్దని, వారు అతి వేగంగా ప్రయాణించి ప్రమాదం జరిగితే అది ఆ తల్లిదండ్రులకి బాధను కలిగిస్తుందని సూచించారు.