News March 11, 2025

NTR: రద్దైన పరీక్ష నిర్వహించేది ఎప్పుడంటే..!

image

పేపర్ లీకైన కారణంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఈ నెల 7న రద్దైన బీఈడీ- పర్స్‌పెక్టివ్ ఇన్ ఛైల్డ్ డెవలప్మెంట్ పేపర్‌ను ఈ నెల 12న నిర్వహించనున్నారు. ఈ మేరకు సోమవారం యూనివర్సిటీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. పేపర్ లీకైన కారణంగా మంత్రి లోకేశ్ ఆదేశాలతో ANU అధికారులు ఆ పరీక్షను రద్దు చేశారు. అటు లీకేజీకి కారణమైన నిందితులను సైతం పోలీసులు అరెస్ట్ చేశారు.

Similar News

News March 12, 2025

అల్లూరి జిల్లాలో YSRకు చెప్పుల దండ

image

అల్లూరి జిల్లా గూడెం కొత్తవీధి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన YSR విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పులు, గాజులు, మద్యం సీసాలను కట్టారు. ఇది గమనించిన స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆ పార్టీ కోశాధికారి కుందెరి రామకృష్ణ విగ్రహానికి ఉన్న చెప్పులను, గాజులు తొలగించారు. YSRని అవమానించడం దారుణమని, ఈ ఘటనను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.

News March 12, 2025

మంచిర్యాల: HMపై పోక్సో కేసు: CI

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ పై పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రమోదరావు తెలిపారు. విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించగా బాధితురాలి కుటుంబ సభ్యులు కలెక్టర్ కుమార్ దీపక్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ ఉపాధ్యాయురాలిని వేధింపులకు గురి చేసినందుకు ఈనెల 5న రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌లో సైతం కేసు నమోదైంది.

News March 12, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.450 పెరిగి రూ.80,650లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.490 తగ్గడంతో రూ.87,980కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,06,900గా ఉంది. వివాహ శుభకార్యాల నేపథ్యంలో బంగారం, వెండికి భారీ డిమాండ్ నెలకొంది.

error: Content is protected !!