News March 12, 2025
NTR: రాష్ట్ర ప్రభుత్వం సువర్ణ అవకాశం కల్పిస్తుంది- కలెక్టర్

సొంతింటి కలను నెరవేర్చుకోలేని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశాన్ని కల్పించిందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మిశ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ.. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహ నిర్మాణం చేపట్టిన లబ్ధిదారులకు యూనిట్ విలువ రూ.1.80 లక్షలకు అదనంగా వివిధ వర్గాల వారికి ప్రయోజనం కల్పిస్తూ ప్రభుత్వం జీఓఆర్‌టీ నం.9విడుదల చేసిందన్నారు.
Similar News
News March 13, 2025
మల్దకల్: పట్టు వదలని విక్రమార్కుడు 4 ఉద్యోగాలు సాధించాడు

మల్దకల్ మం. ఎల్కూరుకి చెందిన నిరుపేద రైతు కూలి బిడ్డ మహమ్మద్ సుభాన్ 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. ధరూర్ మం.లో 2014లో పంచాయతీ కార్యదర్శిగా పనిచేశాడు. 2024లో ప్రభుత్వ గురుకుల పాఠశాల టీచర్, జూనియర్ లెక్చరర్‌గా ఉద్యోగాలు సాధించాడు. 2023లో టీజీపీఎస్సీ నిర్వహించిన జూనియర్ లెక్చరర్ల రాతపరీక్షలో ప్రతిభ చాటి ఫిజిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగం సంపాదించాడు. ఈ మేరకు నియామకపత్రాన్ని సీఎం చేతుల మీదుగా అందుకున్నారు.
News March 13, 2025
మెదక్: బెస్ట్ ఉమన్ ఎంప్లాయ్ అవార్డు అందుకున్న DRO

మెదక్ జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అదే విధంగా వివిధ శాఖలకు చెందిన మహిళా అధికారులను, ఉత్తమ మహిళా ఉద్యోగులను ప్రశంసా పత్రాలతో పాటు బహుమతులను ప్రదానం చేశారు. అందులో భాగంగా ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ గీత అగర్వాల్‌కు కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్ అవార్డు అందజేశారు.
News March 13, 2025
WPL: గెలిస్తే ఫైనల్‌కే

WPL 2025లో ముంబై, గుజరాత్ మధ్య ఇవాళ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టు ఫైనల్ చేరనుంది. ఈ టోర్నీలో గుజరాత్‌పై ముంబై ఇప్పటివరకు ఓటమి లేకుండా సాగుతోంది. దీంతో ఇవాళ మ్యాచ్ ఆసక్తికరంగా మారనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మరోవైపు ఇప్పటికే ఢిల్లీ ఫైనల్ చేరింది. FINAL మ్యాచ్ ఎల్లుండి జరగనుంది.