News April 7, 2025

నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్

image

AP: బకాయిలు చెల్లిస్తేనే NTR వైద్య సేవ పథకం సేవలను కొనసాగిస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. రూ.3,500 కోట్లు బకాయిలు ఉండటంతో ఆర్థిక భారం పెరిగిందని పేర్కొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసిన బకాయిల కంటే నెట్‌వర్క్ ఆసుపత్రులు అందించిన వైద్య సేవల విలువ ఎక్కువని తెలిపింది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి సేవలను కొనసాగించలేమని తాజా లేఖలో పేర్కొంది.

Similar News

News April 16, 2025

చనిపోయినా చిరస్థాయిగా చరిత్రలో ఆమె పేరు!

image

TG: ఖమ్మం జిల్లా గంగారంతండాకి చెందిన దివంగత యువ శాస్త్రవేత్త అశ్వినికి అరుదైన గౌరవం దక్కింది. ప్రొ. జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పూర్వ విద్యార్థిని అయిన ఆమె వ్యవసాయ రంగంలో ఎంతో కృషి చేశారు. గత ఏడాది వరదల్లో ఆమె కన్నుమూశారు. కానీ ఆమె ప్రతిభకు కేంద్రం తాజాగా గుర్తింపు అందించింది. అశ్విని పేరిట జాతీయ స్థాయిలో కొత్త శనగ వంగడాన్ని విడుదల చేసింది. త్వరలో గెజిట్ నోటిఫికేషన్‌లో ఆ వంగడాన్ని పొందుపరచనున్నారు.

News April 15, 2025

ఈ ఆహారం తినే పురుషులు జాగ్రత్త!

image

ప్రాసెస్డ్ & జంక్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్, పిజ్జాలు తినే పురుషుల్లో పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదం అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హార్మోన్ల ప్రభావం వల్ల స్త్రీలలో ఈ రిస్క్ తక్కువ ఉంటుందని చెబుతున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఉన్న పురుషులు టెస్టులు చేయిస్తూ ఉండాలని సూచిస్తున్నారు. కాగా బ్రిటన్‌లోని పురుషులు, స్త్రీలపై 28ఏళ్ల పాటు చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది.

News April 15, 2025

పంజాబ్‌పై వికెట్ల‘కింగ్’గా ఆవిర్భవించిన నరైన్!

image

ముల్లాన్‌పూర్‌లో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో కేకేఆర్ బౌలర్ నరైన్ ఐపీఎల్ రికార్డులకెక్కారు. ఈ మ్యాచ్‌లో ఆయన 2 వికెట్లు తీశారు. ఈక్రమంలో ఆ జట్టుపై ఆయన తీసిన మొత్తం వికెట్ల సంఖ్య 36కు చేరింది. ఐపీఎల్ చరిత్రలో ఏ బౌలరైనా ఓ ప్రత్యర్థి జట్టుపై ఇన్ని వికెట్లు తీయడం ఇదే అత్యధికం.

error: Content is protected !!